లంచం కేసులో పట్టుబడిన వీఆర్వోపై చర్యలు నిలిపివేత
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:47 AM
కోటపాలెం గ్రామ సచివాలయంలో వీఆర్వోగా పనిచేస్తున్న పొగ రు శ్రీనివాసరావుపై ప్రభుత్వం, ప్రాసిక్యూషన్ అను మతి ఇచ్చినప్పటికీ ఆయన మృతి చెందడంతో తదు పరి చర్యలను ప్రభుత్వం రద్దు చేసింది.
రణస్థలం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): కోటపాలెం గ్రామ సచివాలయంలో వీఆర్వోగా పనిచేస్తున్న పొగ రు శ్రీనివాసరావుపై ప్రభుత్వం, ప్రాసిక్యూషన్ అను మతి ఇచ్చినప్పటికీ ఆయన మృతి చెందడంతో తదు పరి చర్యలను ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్ర రెవెన్యూ (విజిలెన్స్-5) శాఖ జారీచేసిన ఉత్తర్వులు ప్రకారం... విజయనగరం పూల్‌బాగ్ కాలనీకి చెందిన గొర్లె వరలక్ష్మికి అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి రూ.20 వేలు లంచం వీఆర్వో శ్రీనివాసరావు డిమాండ్ చేశా రు. ఈ నేపథ్యంలో వరలక్ష్మి ఫిర్యాదు మేరకు 2023 ఆగస్టు 10లంచం తీసుకుంటూ శ్రీనివాసరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. దీనిపై 2025 జనవరి 24న వీఆర్వోపై అభియోగాలు దాఖలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే శ్రీనివాసరావు గతేడాది నవంబరు 5న మృతిచెందడంతో తదుపరి చర్యలు నిలిపివేయాలని ఏసీబీ అధికారులు, కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించారు. దీంతో ప్రభుత్వం విచార ణ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆయన వల్ల ప్రభుత్వానికి ఏదైనా ఆర్థిక నష్టం జరిగిందని తేలితే, ఆ నష్టాన్ని ఆయన వారసుల నుంచి వసూలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జి.జయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు.