Yoga: యోగాతోనే సంపూర్ణ ఆరోగ ్యం
ABN , Publish Date - May 22 , 2025 | 12:11 AM
Yoga for Health ‘శారీరక, మానసిక ఆరోగ్యం.. యోగాతోనే సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ దినం యోగా సాధన చేయాల’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు.
ఆదిత్యాలయంలో యోగాంధ్ర ప్రారంభం
జూన్ 21వరకు నిర్వహణ
గ్రామస్థాయి నుంచి పెద్ద ఎత్తున పాల్గొనాలి
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
అరసవల్లి, మే 21(ఆంధ్రజ్యోతి): ‘శారీరక, మానసిక ఆరోగ్యం.. యోగాతోనే సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ దినం యోగా సాధన చేయాల’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. బుధవారం అరసవల్లిలోని ఆదిత్యాలయంలో ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి.. ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వందలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని సూర్యనమస్కారాలు, ధ్యానం, యోగాసనాలు వేశారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21 వరకు ‘యోగాంధ్ర’ నిర్వహించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. మునిసిపాలిటీల్లో, మండల స్థాయిలో, గ్రామీణ ప్రాంతాల్లో, సచివాలయ స్థాయిలో, అన్ని చోట్లా యోగా శిక్షణను ప్రారంభించాలన్నారు. జూన్ 21వ తేదీ నాటికి జిల్లా వ్యాప్తంగా లక్షలాదిగా ప్రజలు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేలా చేయాలన్నారు. క్విట్ ఇండియా, క్విట్ ంధ్రా ఉద్యమంలా యోగాను ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. మొదటివారం జిల్లా స్థాయిలో, రెండవ వారం మండల స్థాయిలో, మూడవ వారం గ్రామస్థాయిలో యోగాసనాలు ఉంటాయని తెలిపారు. ప్రతీ ఒక్కరూ యోగాంధ్ర వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. అలాగే యోగాపై డిబేట్, వ్యాసరచన, తదితర పోటీలను నిర్వహిస్తామన్నారు. ప్రజలంతా కుటుంబసమేతంగా సాధన చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వేంకటేశ్వరరావు, ఆర్డీఓ కె.సాయిప్రత్యూష, పర్యాటక శాఖాధికారి ఎన్.నారాయణరావు, కార్పొరేషన్ కమిషనర్ ప్రసాదరావు, డీఎంహెచ్‌వో డాక్టర్ అనిత, యోగా టీచర్లు మురళీ, తంగి స్వాతి, వారణాశి సందీప్, దేశళ్ల సురేంద్ర, రామారావు, గాయత్రి, జిల్లా అధికారులు, వివిధ యోగాసంస్థల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.