Share News

గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడికినాలుగేళ్ల జైలుశిక్ష

ABN , Publish Date - Sep 25 , 2025 | 12:08 AM

: గంజాయి అక్రమ రవాణా కేసులో బుడుమూరు నాగరాజు అనే వ్యక్తికి నాలుగేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10వేల జారిమానా విధిస్తూ శ్రీకాకుళం మొదటి అదనపు జిల్లా న్యాయాధికారి పి.భాస్కరరావు బుధవారం తీర్పు వెల్లడించారని టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు తెలిపారు.

  గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడికినాలుగేళ్ల జైలుశిక్ష

టెక్కలి, సెప్టెంబరు 24(ఆంరఽధజ్యోతి): గంజాయి అక్రమ రవాణా కేసులో బుడుమూరు నాగరాజు అనే వ్యక్తికి నాలుగేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10వేల జారిమానా విధిస్తూ శ్రీకాకుళం మొదటి అదనపు జిల్లా న్యాయాధికారి పి.భాస్కరరావు బుధవారం తీర్పు వెల్లడించారని టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు తెలిపారు. 2023 జనవరి 1న టెక్కలి జగతిమెట్ట సర్వీస్‌ రహదారిపై పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా, నాగరాజు తన ద్విచక్ర వాహనంపై ఒడిశా రాష్ట్రం చీకటి గ్రామం నుంచి గంజాయిని జిల్లాలోకి తీసుకు వస్తుండగా అప్పటి టెక్కలి ఎస్‌ఐ ఎల్‌.రామకృష్ణకు పట్టుబడ్డాడు. నాగరాజు నుంచి రూ.27,500 విలువగల 5కేజీల 450 గ్రాముల గంజాయి, ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి సీఐ సూర్యచంద్రమౌళి కేసు దర్యాప్తు చేశారు. ఈ కేసును స్పెషల్‌ పీపీ కింజరాపు శ్రీనివాసరావు వాదించారు. నేరం రుజువు కావడంతో నాగరాజుకు కోర్టు జైలు శిక్ష విధించినట్లు డీఎస్పీ తెలిపారు. రూ.10వేల జరిమానా చెల్లించని యెడల ఆరు నెలల పాటు సాధారణ జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయాధికారి తీర్పులో పేర్కొన్నారు. అప్పటి సీఐ సూర్యచంద్రమౌళి, ఎస్‌ఐ రామకృష్ణ, కేసు వాదించిన పీపీ శ్రీనివాసరావు, కోర్టు లైజనింగ్‌ అధికారి గోవిందరావులను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అభినందించారు.

Updated Date - Sep 25 , 2025 | 12:08 AM