హత్యకేసులో నిందితుడి అరెస్టు
ABN , Publish Date - Jul 09 , 2025 | 12:07 AM
వసపలో జరిగిన హత్యకేసులో నింది తుడు మనగాన శంకరావును అరెస్టు చేసినట్టు కొత్తూరు సీఐ సీహెచ్ ప్రసాద్ తెలి పారు.
కొత్తూరు, జూలై 8(ఆంధ్రజ్యోతి): వసపలో జరిగిన హత్యకేసులో నింది తుడు మనగాన శంకరావును అరెస్టు చేసినట్టు కొత్తూరు సీఐ సీహెచ్ ప్రసాద్ తెలి పారు. మంగళవా రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హత్యకు గురైన లుకలాపు మిన్నారా వు(19) శనివారం రాత్రి మద్యం తాగి టిఫిన్ షాప్‌కి వెళ్లి శంకరరావుతో గొడవప డ్డాడు. వీరిద్దరి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో శంకరావు సుత్తితో మి న్నారావు తలపై కొట్టడంతో పడిపోయాడు. కొనఊపిరితో ఉన్న మిన్నారావు బతి కితే తనకు ముప్పు తప్పదన్న భయంతో అతడి గొంతుకోసి అతికిరాతంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని రహదారికి అవతలి వైపునకు తీసుకెళ్లి పడేశా డు. హత్యకు ఉపయోగించిన సుత్తి, కత్తిని స్వాధినం చేసుకున్నామని, నిందితు డ్ని కొత్తూరు కోర్టులో మంగళవారం హాజరు పరిచినట్టు సీఐ తెలిపారు. సీఐతో పాటు ఎస్‌ఐ ఎండీ అమీర్ ఆలీ, ఏఎస్‌ఐ రాజేశ్వరావు, హెచ్‌సీ కోటి ఉన్నారు.