హత్యకేసులో నిందితుడి అరెస్టు
ABN , Publish Date - Jun 24 , 2025 | 11:41 PM
క్షణికావేశంలో మామ గంగయ్యను హత్యచేసిన కేసులో నిందితుడు అల్లుడు పాతిర్ల దశరథను లొద్దపుట్టి వద్ద మంగళవారం పట్టుకున్నట్టు ఇచ్ఛాపురం సీఐ ఎం.చిన్నంనాయుడు తెలిపారు.
ఇచ్ఛాపురం, జూన్ 24(ఆంధ్రజ్యోతి): క్షణికావేశంలో మామ గంగయ్యను హత్యచేసిన కేసులో నిందితుడు అల్లుడు పాతిర్ల దశరథను లొద్దపుట్టి వద్ద మంగళవారం పట్టుకున్నట్టు ఇచ్ఛాపురం సీఐ ఎం.చిన్నంనాయుడు తెలిపారు. ఇందుకు సం బంధించిన వివరాలను సీఐ మంగళవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో వెల్ల డించారు. ఈనెల 16వ తేదీన మండపల్లిలో బైక్ విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో మామపై కోపం పెంచుకున్న దశరథ చంపే శాడు. నిందితుడ్ని అరెస్టు చేసి ఇచ్ఛాపురం కోర్టులో హాజరుపరచినట్టు సీఐ తెలిపారు.