Share News

ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి

ABN , Publish Date - May 20 , 2025 | 11:59 PM

చట్టప్రకారం వీక్లీఆఫ్‌, జాతీయ సెల వులు అమలుచేయాలని, విధి నిర్వహణలో భాగంగా ఇచ్చిన సెల్‌ఫోన్ల రీచార్జీ ఖర్చులు ఇవ్వాలని, ప్రమాద బీమా, ఎక్స్‌గ్రేషియా, ఇన్య్సూరెన్స్‌ సౌక ర్యం కల్పించాలని తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ యూనియన్‌ డ్రైవర్ల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.శ్రీనివాసరావు, దశరథ కోరారు.

 ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి
నిరసన్న తెలుపుతున్న తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ యూనియన్‌ డ్రైవర్లు:

శ్రీకాకుళం, మే 20(ఆంధ్రజ్యోతి): చట్టప్రకారం వీక్లీఆఫ్‌, జాతీయ సెల వులు అమలుచేయాలని, విధి నిర్వహణలో భాగంగా ఇచ్చిన సెల్‌ఫోన్ల రీచార్జీ ఖర్చులు ఇవ్వాలని, ప్రమాద బీమా, ఎక్స్‌గ్రేషియా, ఇన్య్సూరెన్స్‌ సౌక ర్యం కల్పించాలని తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ యూనియన్‌ డ్రైవర్ల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.శ్రీనివాసరావు, దశరథ కోరారు. మంగళవారం శ్రీకాకు ళంలోని కలెక్టరేట్‌ వద్ద తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేస్తున్న డ్రైవర్లు సమ స్యలు పరిష్కరించాలని సమ్మెలో భాగంగా నిరసన ప్రదర్శన నిర్వహించా రు.ఈసందర్భంగా మాట్లాడుతూ అరబిందోయాజమాన్యం పదేళ్లుగా తక్కు వ వేతనం ఇస్తోందని, ఆ వేతనంతో పెరిగిన నిత్యావసర ధరలతో జీవనం సాగించడం దుర్భరంగాఉందని తెలిపారు.కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.సూరయ్య, టౌన్‌ కన్వీనర్‌ ప్రకాశరావు, కె.రాజేశ్వరరావు, కె.కృష్ణంనాయుడుఎల్‌.రాంబాబు, పి.వెంకటరావు, ఎం.మణికంఠ, పి.అనంత్‌, ఎస్‌.రాజశేఖర్‌, బి.చిరంజీవి పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2025 | 11:59 PM