అభివృద్ధి పనులు వేగవంతం చేయండి
ABN , Publish Date - Jul 30 , 2025 | 11:53 PM
పలాస రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఈస్ట్‌కోస్ట్ రైల్వే ఖుర్ధా డివిజన్ మేనేజర్ అలోక్‌త్రిపాఠి అన్నారు.
ఫ పలాస రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన డీఆర్‌ఎం
పలాస, జూలై 30 (ఆంధ్రజ్యోతి): పలాస రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఈస్ట్‌కోస్ట్ రైల్వే ఖుర్ధా డివిజన్ మేనేజర్ అలోక్‌త్రిపాఠి అన్నారు. డీఆర్‌ఎంగా ఆయన రెండు రోజుల కిందట బాధ్యతలు స్వీకరించారు. మొదటి పర్యటనలో భాగంగా పలాస రైల్వేస్టేషన్‌కు వచ్చి ఆధునికీకరణ పనులు పరిశీలించారు. రైల్వేస్టేషన్ ఆధునికీకరణకు కేంద్రం రూ.25 కోట్ల మేర నిధులు విడుదల చేసింది. ఈ పనులను డీఆర్‌ఎం పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. టిక్కెట్ కౌంటర్ ఉన్న ప్రాంతంలో పూర్తిస్థాయి రైల్వేస్టేషన్ అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న స్టేషన్ మేనేజర్ కార్యాలయం, విశ్రాంతి మందిరం, టిక్కెట్ కార్యాలయం, ఫ్లాట్‌ఫారంలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట డివిజన్ అధికారులతో పాటు పలాస రైల్వేస్టేషన్ సిబ్బంది ఉన్నారు.