‘అభ్యుదయం’ సైకిల్ యాత్ర ప్రారంభం
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:06 AM
అనకాపల్లి జిల్లా పాయకరావు పేటలో ప్రారంభమైన ‘అభ్యుదయం’ సైకిల్ యాత్ర సోమవారం జిల్లాలో ప్రవేశించింది. గంజాయి, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా యువత, ప్రజలను చైతన్య పరిచేందుకు 25 మంది పోలీసు సిబ్బంది ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల పరిధిలో 1200 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేపడు తున్నారు. ఈ యాత్రకు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు స్వాగతం పలికారు.
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: ఎస్పీ, జేసీ, ఎమ్మెల్యే
రణస్థలం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా పాయకరావు పేటలో ప్రారంభమైన ‘అభ్యుదయం’ సైకిల్ యాత్ర సోమవారం జిల్లాలో ప్రవేశించింది. గంజాయి, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా యువత, ప్రజలను చైతన్య పరిచేందుకు 25 మంది పోలీసు సిబ్బంది ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల పరిధిలో 1200 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేపడు తున్నారు. ఈ యాత్రకు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రణస్థలం హైస్కూల్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా పోలీసు శాఖ ఈ సైకిల్ యాత్రను చేపట్టిందని, దీనిలో ప్రతిఒక్కరూ భాగస్వా ములు కావాలని కోరారు. మత్తు పదార్థాలకు అలవాటు పడినవారి సమాచారం 1972 నెంబర్‌కు తెలియజేయాలని, వారిలో మార్పు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఓ తల్లి కన్నీటి పర్యంత మవుతూ తన కుమారుడు గంజాయి బారిన పడిన విషయాన్ని చెప్పడంతో అందరూ చలించి పోయారు. ప్రముఖ జానపద కళాకారుడు పల్సర్‌బైక్ రమణ మత్తు పదార్థాలతో వచ్చే అనర్థాలపై పాడిన పాటలు ఆలోచింపజేశాయి. విద్యా ర్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పోటీ విజేత లకు బహుమతులను అందించారు. కార్యక్రమంలో డీఎస్పీ వివేకానంద, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, సీఐ ఎం.అవతారం, తహసీల్దార్ సనపల కిరణ్ కుమార్, జేఆర్ పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి, కూటమి నాయకులు చౌదరి బాబ్జీ, పిన్నింటి భానోజి నాయుడు, పిసిని జగన్నాథం నాయుడు, ముక్కు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.