ప్రేమ పేరుతో మోసగించిన యువకుడు
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:14 AM
ప్రేమ పేరుతో ఓ గిరిజన బాలికను మోసగించిన ఘటన బూర్జ మండలంలో చోటుచేసుకుంది.
బూర్జ మండలంలో ఘటన.. కేసు నమోదు
బూర్జ (ఆమదాలవలస), అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): ప్రేమ పేరుతో ఓ గిరిజన బాలికను మోసగించిన ఘటన బూర్జ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బూర్జ మండలంలోని ఓ గిరిజన గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికను సవర పవన్‌కుమార్(20) కొంతకాలంగా ప్రేమిస్తున్నట్టు, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో ఆ బాలిక గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో అతడిని నిలదీశారు. ఈ విషయంలో తనకు సంబంధం లేదని తప్పించుకు నేందుకు పవన్ కుమార్ యత్నించాడు. గురువారం బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు బూర్జ ఎస్‌ఐ ప్రవళ్లిక తెలిపారు.