Share News

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ABN , Publish Date - Dec 25 , 2025 | 12:22 AM

తాళ్లవలస గ్రామం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇజ్జాడ గణేష్‌ (20) విశాఖలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు.

చికిత్స పొందుతూ యువకుడి మృతి

లావేరు, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): తాళ్లవలస గ్రామం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇజ్జాడ గణేష్‌ (20) విశాఖలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సుభద్రాపురానికి చెందిన గణేష్‌ గ్రామం నుంచి తాళ్లవలస వద్ద ఉన్న పెట్రోల్‌ బంకు వైపు సర్వీస్‌ రోడ్డులో ద్విచక్ర వాహనంతో వెళ్లుండగా ఎదురుగా వస్తున్న మరో బైక్‌ ఢీకొన డంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రు డిని స్థానికులు 108 వాహనంలో చికిత్స కోసం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి లో చేర్పించారు. అతని పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గణేష్‌ బుధవారం మృతి చెందాడు. ఇజ్జాడ రమణ, సత్యవతి రెండో కుమారుడు గణేష్‌. ఇతడు విజయనగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ఫస్టియర్‌ చదువుతున్నాడు. గణేష్‌ తండ్రి రమణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ జోగారావు తెలిపారు.

సుభద్రాపురం వద్ద లారీ క్లీనర్‌..

లావేరు, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): సుభద్రాపురం వద్ద జాతీయ రహదారి పై బుధవారం వేకువ జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ క్లీనర్‌ ఎం.కృష్ణ (54) మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖ నుంచి వస్తున్న లారీని అదే దిశలో వెనుక నుంచి వస్తున్న మరో లారీ బలంగా ఢీకొంది. ఈ ఘటనలో వెనుక లారీలో ఉన్న క్లీనర్‌ ఎం.కృష్ణకు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం 108 వాహనంలో శ్రీకాకుళం తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడిది పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంగా పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్‌ ఇమాన్‌ ఆలీ బిశ్వాస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లావేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Dec 25 , 2025 | 12:22 AM