Share News

గోతిలో పడి యువకుడి మృతి

ABN , Publish Date - Dec 15 , 2025 | 12:01 AM

మండ ల కేంద్రం రణస్థ లం జాతీయ ర హదారి విస్తరణ లో భాగంగా ఫ్లైఓవర్‌ పనులు జరుగుతున్నాయి.

గోతిలో పడి యువకుడి మృతి

రణస్థలం, డి సెంబరు 14(ఆం ధ్రజ్యోతి): మండ ల కేంద్రం రణస్థ లం జాతీయ ర హదారి విస్తరణ లో భాగంగా ఫ్లైఓవర్‌ పనులు జరుగుతున్నాయి. అయితే సినిమా థియేటర్‌ సమీపంలో వంతెన నిర్మాణానికి సంబంధించిన గోతిలో పడి ఆదివారం డి.నర్సింగరావు (24) మృతి చెందాడు. జేఆర్‌ పురం ఎస్‌ఐ ఎస్‌.చిరం జీవి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మద్యం మత్తులో నర్సింగరావు ద్విచక్ర వాహనంతో వచ్చి అదుపు తప్పి గోతిలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు లావేరు మండలం వేణుగోపాలపురానికి చెందినవాడు. ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. తండ్రి డి.లక్ష్మణరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు.

Updated Date - Dec 15 , 2025 | 12:01 AM