Share News

బావిలో దూకి యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Dec 26 , 2025 | 12:03 AM

స్థానిక నాయుడు వీధికి చెందిన నల్లి సురేష్‌ (42) బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల కేంద్రానికి సమీపంలో ఓ బావిలో గురువారం సురేష్‌ మృతదేహాన్ని గుర్తించారు.

బావిలో దూకి యువకుడి ఆత్మహత్య

పొందూరు, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): స్థానిక నాయుడు వీధికి చెందిన నల్లి సురేష్‌ (42) బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల కేంద్రానికి సమీపంలో ఓ బావిలో గురువారం సురేష్‌ మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో పాటు మతిస్థిమితం కోల్పవడంతో సురేష్‌ ఇబ్బంది పడుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం నుంచి సురేష్‌ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం వెతికారు. గురువారం సురేష్‌ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు సురేష్‌ మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

మెళియాపుట్టిలో వృద్ధురాలు...

మెళియాపుట్టి, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): మెళియాపుట్టి రెడ్డిబజార్‌ వీధికి చెందిన కొల్లి మాణిక్యం (74) అనే వృద్ధురాలు స్థానిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఉన్న నేల బావిలో పడి మృతి చెందినట్లు ఎస్‌ఐ పి.రమేష్‌బాబు తెలిపారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాణిక్యం కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతోంది. కొన్నాళ్లుగా సంతబొమ్మాళి మండలంలో ఉన్న తన కుమార్తె వద్ద మాణిక్యం ఉంటోంది. ఇటీవల మెళియాపుట్టి వచ్చింది. రెండు రోజులుగా ఆమె కనిపించటం లేదని బంధువులు చెబుతున్నారు. అయితే గురువారం బావిలో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈమేరకు మృతదేహాన్ని బయటకు తీసి... పోస్టుమార్టంకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Updated Date - Dec 26 , 2025 | 12:03 AM