Share News

న్యాయం కావాలని కుమార్తెతో బైఠాయించిన మహిళ

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:12 AM

స్థానిక ఇందిరాగాంధీ కూడలిలో బుధవారం టెక్కలి మేజర్‌ పంచా యతీ ఎన్టీఆర్‌ కాల నీకి చెందిన ఆర్‌. సంధ్య అనే మహిళ ఫ్లెక్సీ ఏర్పాటుచేసి తన ఎనిమిదేళ్ల కు మార్తె ఉషాకిరణ్‌తో కలిసి న్యాయం కా వాలని బైఠాయించిం ది.

న్యాయం కావాలని కుమార్తెతో బైఠాయించిన మహిళ
ఇందిరాగాంధీ కూడలిలో నిరసన తెలుపుతున్న మహిళ

టెక్కలి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): స్థానిక ఇందిరాగాంధీ కూడలిలో బుధవారం టెక్కలి మేజర్‌ పంచా యతీ ఎన్టీఆర్‌ కాల నీకి చెందిన ఆర్‌. సంధ్య అనే మహిళ ఫ్లెక్సీ ఏర్పాటుచేసి తన ఎనిమిదేళ్ల కు మార్తె ఉషాకిరణ్‌తో కలిసి న్యాయం కా వాలని బైఠాయించిం ది. తన భర్త కట్టిన ఇల్లును ఆడపడుచు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని, అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువైందని సంధ్య కన్నీరుమున్నీరుగా విలపించింది. తన భర్త పార్వతీశం కరోనా సమయంలో మృతిచెందారని, దీంతో తన ఇల్లును దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఈ ప్రాంతంలో వైసీపీ కార్యకర్తల ర్యాలీ ఉందని, వెళ్లిపోవాలని చెప్పడంతో ఆమె అక్కడ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. కాళ్లరిగేలా న్యాయం కోసం తిరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని ఆమె వాపోయింది.

Updated Date - Nov 13 , 2025 | 12:12 AM