ఖాళీ పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:48 PM
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలతో వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్య దర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలతో వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్య దర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్ వద్ద మంగళవారం నిరుద్యోగులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదన్నారు. నిరుద్యోగ భృతి అందించాలన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు హేమంత్, రామోజీ, కిషోర్, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.