Share News

చంద్రబాబుకు ఘన స్వాగతం

ABN , Publish Date - Apr 27 , 2025 | 12:19 AM

మహిళల ఆర్థిక స్వావలంబనకు, పేదరిక నిర్మూలనకు డ్వాక్రా సంఘాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. మత్స్యకార సేవలో పేరిట బుడగట్లపాలెం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

 చంద్రబాబుకు ఘన స్వాగతం
చంద్రబాబుతో మాట్లాడుతున్న మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు

ఎచ్చెర్ల/రణస్థలం, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): మహిళల ఆర్థిక స్వావలంబనకు, పేదరిక నిర్మూలనకు డ్వాక్రా సంఘాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. మత్స్యకార సేవలో పేరిట బుడగట్లపాలెం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

అశోక్‌ గారూ.. ఇంత ఎండలో వచ్చేశారా?

ఎచ్చెర్ల/రణస్థలం, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్ల పాలెం సముద్ర తీరంలో ఏర్పాటుచేసిన హెలీ పాడ్‌ వద్దకు స్వాగతం పలికేందుకు వచ్చిన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతి రాజును చూసి సీఎం చంద్రబాబునాయుడు ‘అశోక్‌ గారూ.... ఇంత ఎండలో వచ్చేశారా’ అంటూ సరదాగా ప్రశ్నించారు. దీనికి అశోక్‌గజపతిరాజు స్పందిస్తూ... ‘మా నాయకుడు వస్తే... నేను రాకుండా ఉండగలనా’ అన్నారు. దీంతో సీఎం ఒక్కసారిగా నవ్వేశారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన పార్ల మెంటరీ నియోజక వర్గం కూడా ఇదే కదా అని గుర్తు చేశారు. ప్రస్తుత ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చాలా చక్కగా చేస్తున్నారంటూ అశోక్‌ గజపతిరాజు.. కలిశెట్టి భుజం తట్టారు. దీనికి సీఎం స్పందిస్తూ... ‘అవును. ఇక్కడే కాదు.. ఢిల్లీలో కూడా ఎంపీ అప్పలనాయుడు తనదైన రీతిలో పని చేసుకుంటున్నార’ని సీఎం అభినందించారు.

Updated Date - Apr 27 , 2025 | 12:20 AM