శబరిమలలో జిల్లావాసి మృతి
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:17 AM
రాగోలు పంచాయతీ కూటికుప్పలవానిపేటకు చెందిన గురుస్వామి గురుగుబెల్లి వరహానరసింహులు(72) కేరళ రాష్ట్రం శబరిమలలో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్టు తోటి స్వాములు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
శ్రీకాకుళం రూరల్, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): రాగోలు పంచాయతీ కూటికుప్పలవానిపేటకు చెందిన గురుస్వామి గురుగుబెల్లి వరహానరసింహులు(72) కేరళ రాష్ట్రం శబరిమలలో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్టు తోటి స్వాములు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నలుగురు అయ్యప్ప స్వామి మాల ధరించగా వారితో పాటు మరో ముగ్గురు కలిసి ఈనెల 3న శబరిమల వెళ్లారు. శుక్రవారం వేకువ జామున శబరిమల కొండకు చేరుకున్న తరువాత వరహా నరసింహాలకు గుండెపోటు రావడంతో ఒక్కసారి కుప్పకూలిపోయాడు. వెంటనే ఇతర స్వాములు సమీపంలో ఆసుపత్రికి అంబులెన్సులో తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ము గ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈయన 1993 నుంచి మాలా ధారణ వేస్తూ గురుస్వామిగా పరిసర ప్రాంతాల్లో పేరొందారు. వరాహన రసింహులు మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.