అమెరికాలో కొత్తపేటవాసి మృతి
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:03 AM
కొత్తపేట గ్రా మానికి చెందిన సుంకరి రమేష్(40) అమెరికాలో శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు.
కోటబొమ్మాళి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): కొత్తపేట గ్రా మానికి చెందిన సుంకరి రమేష్(40) అమెరికాలో శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. రమేష్ సుమారు 10ఏళ్లుగా అమెరికాలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా అనారోగ్యం తో బాధపడుతూ ఆసుప్రతిలో చేరాడు. అక్కడ చికిత్స పొం దుతూ శుక్రవారం మృతి చెందాడు. రమేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మత్స్యకారుల మధ్య కొట్లాట
నలుగురికి గాయాలు
ఇచ్ఛాపురం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): బూర్జుపాడు పంచాయతీ డొంకూరు గ్రామంలో మత్స్యకారుల్లో రెండు వర్గాల మధ్య శుక్రవారం ఘర్షణ చెలరేగడంతో నలుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొండ నీలాద్రి అనే వ్యక్తి తన బోటులో సముద్రంలో వేటకు వెళ్లి చేపలను తెచ్చుకున్నాడు. వా టిని ఓ షెడ్‌లో భద్రపరిచాడు. ఎస్.దేవ, చీకటి దుర్యోధన, బడే ఎర్రయ్య తదితర మత్స్యకారులు అక్కడికి వచ్చి షెడ్‌లో నీలాద్రి దాచుకున్న చేపలను బయటపడే శారు. ఈ విషయం తెలుసుకున్న నీలాద్రి వర్గానికి చెందిన బుడ్డ సన్యాసి, కొండా నీలాద్రి, కొండా ప్రేమ్‌కుమార్, బి.ఢిల్లీరావు, కె.కృపారావు, బి.పాపయ్య, బి.రాజు తదితరులు అక్కడికి చేరుకుని వారిని నిలదీశారు. ఈ ఘటనను నీలాద్రి వర్గానికి చెందిన వారు వీడియో తీసేందుకు ప్రయత్నించగా.. మరో వర్గం వారు సెల్‌ను తీసుకుని ‘మాపైనే పోలీస్ స్టేషన్‌కు వెళ్తారా’ అంటూ దాడి చేశారు. దీంతో బి.సన్యాసి, బి.రాజు, కె.ప్రేమ్‌కుమార్, పి.కృష్ణారావు గాయడ్డారు. పట్టణ ఎస్‌ఐ ముకుందరావు, కవిటి ఎస్‌ఐ రవివర్మ ఇరు వర్గాలతో చర్చించి సర్ది చెప్పారు. గాయపడిన మత్స్యకారులను ఇచ్ఛాపురం సీహెచ్‌సీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ముకుందరావు తెలిపారు.
యువతి అదృశ్యంపై కేసు నమోదు
శ్రీకాకుళం క్రైం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నానికి చెందిన వివాహి త సుజాత అదృశ్యంపై ఆమె తల్లి ఫిర్యాదు చేయడంతో శ్రీకాకుళం టూటౌన్ పో లీసులు కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు.. విశాఖపట్నం లో నివాసం ఉంటున్న సుజాత తన అక్క సుమతికి ఆరోగ్యం బాగోలేకపోవడం తో సపర్యలు చేసేందుకు ఈ నెల 2న శ్రీకాకుళం వచ్చింది. తిరిగి 4వ తేదీ మధ్యాహ్నం విశాఖలో ఉన్న తన భర్త వద్దకు వెళ్లిపోతానని చెప్పడంతో.. సుమతి భర్త ద్విచక్ర వాహనంపై సుజాతను శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద దించి వెళ్లిపోయాడు. రాత్రి అయినా సుజాత ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త శ్రీకాకుళంలో ఉన్న సుజాత అక్క, బావలకు ఫోన్ చేసి అడిగడంతో విషయం బయటపడింది. దీంతో ఆమె ఆచూకీ కోసం వ్యతికినా ఫలితం లేకపోయింది. దీంతో సుజాత తల్లి సవర చిలకమ్మ ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శ్రీకాకుళం టూటౌన్ సీఐ ఈశ్వరరావు తెలిపారు.