Share News

వెనక్కి తగ్గిన సంద్రం

ABN , Publish Date - Dec 20 , 2025 | 12:20 AM

స్థానిక శివసాగర్‌ బీచ్‌లో సముద్రం వెనక్కి తగ్గడంతో పర్యాటకులకు వింత అనుభూతిని పొందుతున్నారు.

వెనక్కి తగ్గిన సంద్రం
శివసాగర్‌ బీచ్‌లో వెనక్కి తగ్గి ప్రశాంతంగా ఉన్న సముద్రం

వజ్రపుకొత్తూరు, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): స్థానిక శివసాగర్‌ బీచ్‌లో సముద్రం వెనక్కి తగ్గడంతో పర్యాటకులకు వింత అనుభూతిని పొందుతున్నారు. సుమారు 50 మీటర్ల మేర సముద్రం వెనక్కి తగ్గడం.. తక్కువ ఎత్తులో కేరటాలు లేస్తూ ప్రశాంతంగా కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న పర్యాటకులు అధిక సంఖ్యలో తీరానికి తరలి వచ్చి ఈ దృ శ్యాన్ని చూసి సందడిగా గడి పారు. ఎప్పు డూ పెద్దపెద్ద అలలతో ముం దుకు వచ్చే సముద్రం ఇలా వెనక్కి తగ్గడం పై వితంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. మత్స్యకారులు సైతం ప్రశాతంగా ఉన్న సముద్రాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూన్నారు. కాగా గతరెండు రోజులుగా స ముంద్రం ఇలాగే కనిపిస్తుందని పలువురు వాకర్స్‌ చెబుతున్నారు. మొత్తం మీద అలలు శబ్దంతో హోరె త్తించే సముద్రం వెనక్కి తగ్గి ప్రశాంతగా కనిపిం చడంతో పర్యాటకులు వింత అనుభూతిని పొందుతున్నారు.

Updated Date - Dec 20 , 2025 | 12:20 AM