రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , Publish Date - Nov 23 , 2025 | 12:07 AM
మందస మండలం బాలిగాం గ్రామం వద్ద శనివారం సా యంత్రం రోడ్డు ప్రమాదంలో గుజ్జు ధర్మరావు(45) మృతి చెందినట్టు ఎస్‌ఐ కృష్ణప్ర సాద్ తెలిపారు.
మందస/ఇచ్ఛాపురం, నవంబరు 22(ఆంధ్రజ్యో తి): మందస మండలం బాలిగాం గ్రామం వద్ద శనివారం సా యంత్రం రోడ్డు ప్రమాదంలో గుజ్జు ధర్మరావు(45) మృతి చెందినట్టు ఎస్‌ఐ కృష్ణప్ర సాద్ తెలిపారు. ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన ధర్మరావు ద్విచక్రవాహనంపై మందస వస్తుం డగా.. జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో ఎదురు గా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరి గింది. 108 వాహనంలో హరిపురం సీహెచ్‌సీకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.