Share News

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , Publish Date - Sep 27 , 2025 | 12:13 AM

కొత్తపల్లి గ్రామ సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన వాన వైకుంఠరావు(55) మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కోటబొమ్మాళి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): కొత్తపల్లి గ్రామ సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన వాన వైకుంఠరావు(55) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వైకుంఠరావు గురువారం సాయంత్రం సరియాపల్లి గ్రామ సమీపంలో ఉన్న పొలం పనులు ముగించుకొని నడుచుకుంటూ ఇంటికి వస్తుండగా అదే గ్రామా నికి చెందిన కప్పల రమణ తన ద్విచక్రవాహనం పై వెనుక నుంచి బలంగా ఢీ కొన్నాడు. ఈ ఘటనలో వైకుంఠరావు అక్కడికక్కడే మృతి చెందగా, రమణ గా యపడ్డాడు. రమణను చికిత్స నిమిత్తం టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తర లించారు. వైకుంఠరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వా సుపత్రికి తరలించారు. వైకుంఠరావు భార్య రత్నాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు. మృతు డికి భార్య రత్నలుతోపాటు కుమారుడు శశిభూషణరావు ఉన్నారు.

Updated Date - Sep 27 , 2025 | 12:13 AM