Share News

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , Publish Date - Jul 09 , 2025 | 12:05 AM

చిలకపాలెం ఫ్లై ఓవర్‌పై మంగళవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందా డు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఎచ్చెర్ల, జూలై 8(ఆంధ్రజ్యోతి): చిలకపాలెం ఫ్లై ఓవర్‌పై మంగళవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందా డు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీనివాస్‌ దీక్షిత్‌ (52) విశాఖ జిల్లా ఆనందపురం నుంచి ద్విచక్ర వాహనంపై శ్రీకాకుళం వైపు వస్తుండగా.. బైక్‌ అదుపు తప్పి పక్కన ఉన్న గోడను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. శ్రీనివాస్‌ దీక్షిత్‌ ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం లక్నోలో ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఆరు నెలల కింద ట బలగలో నివాసం ఉంటున్న తమ్ముడు శ్రీధర్‌ దీక్షిత్‌ ఇంటికి వచ్చి ఉంటున్నా డు. ఈనెల 6న ఆనందపురంలో ఉంటున్న మరో తమ్ముడు శ్రీకాంత్‌ దీక్షిత్‌ ఇంటికి బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శ్రీనివాస్‌ దీక్షిత్‌ భార్య లక్నోలో ఉంటున్నారు. మృతుడి సోదరుడు శ్రీధర్‌ దీక్షిత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 09 , 2025 | 12:05 AM