Share News

చిక్సిత పొందుతూ వ్యక్తి మృతి

ABN , Publish Date - Dec 13 , 2025 | 11:58 PM

దేరసాం గ్రామానికి చెందిన ఎస్‌.శ్రీను (30) శనివారం విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

చిక్సిత పొందుతూ వ్యక్తి మృతి

రణస్థలం, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): దేరసాం గ్రామానికి చెందిన ఎస్‌.శ్రీను (30) శనివారం విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జేఆర్‌ పురం ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 3న ఎస్‌.శ్రీను, పిల్ల శ్రీను ద్విచక్రవాహనంపై స్వగ్రామం దేరసాం వెళ్తుండగా జాతీయరహదా రిపై బీరు పరిశ్రమ ఎదురుగా ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదం లో ఎస్‌.శ్రీను తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కుటుంబ సభ్య్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చోరీ కేసులో నిందితుడికి జైలు

కంచిలి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): కంచిలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మోటార్‌ సైకిల్‌ దొంగతనం చేసిన గొల్లకంచిలికి చెందిన డొక్కరి రవికి సోంపేట కోర్టు న్యాయాధికారి కె.శ్రీనివాసరావు ఎనిమిది నెలల జైలుశిక్ష, రూ.1000 జరిమా నా విధించినట్లు ఎస్‌ఐ పి.పారినాయుడు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేసును తాను దర్యాప్తు చేయగా ఏపీపీ నరేష్‌ వాదించినట్లు తెలిపారు.

Updated Date - Dec 13 , 2025 | 11:58 PM