Share News

వ్యక్తి ఆత్మహత్య

ABN , Publish Date - Nov 01 , 2025 | 12:20 AM

పెద్దబమ్మిడి గ్రామానికి చెందిన బలివాడ మోహన్‌(45) నిమ్మాడ-తిలారు రహదారిలోని ఓ గ్రానైట్‌ పరిశ్రమకు సమీప తోటలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

వ్యక్తి ఆత్మహత్య

కోటబొమ్మాళి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): పెద్దబమ్మిడి గ్రామానికి చెందిన బలివాడ మోహన్‌(45) నిమ్మాడ-తిలారు రహదారిలోని ఓ గ్రానైట్‌ పరిశ్రమకు సమీప తోటలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మోహన్‌ ఐదేళ్ల కిందట చిన్నబమ్మిడి జంక్షన్‌లోని వేబ్రిడ్జిలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తుండగా, ఆయన భార్య హేమలత పెద్దబమ్మిడి గ్రామంలో చిన్న కిరాణిషాపు నడుపుతుండేది. వ్యాపారం సరిగా జరగకపోవడం తో రెండేళ్ల కిందట కుటుంబసభ్యులతో కలిసి శ్రీకాకుళం కొత్తరోడ్డు దగ్గరలో కిరా ణిషాపు నడుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే మోహన్‌ కొన్నాళ్లగా మానసి కరుగ్మతలతో బాధపడుండేవాడు. గతంలో ఓసారి తన ఇంట్లోనే ఉరివేసుకొనే ప్రయత్నం చేయగా కుటుంబసభ్యులు చూసి అడ్డుకున్నారు. ఈ క్రమం మోహన్‌ గురువారం మధ్యాహ్నం 12గంటల సమయంలో నిమ్మాడ జంక్షన్‌లో ఉన్న తన అన్నయ్య తిరుపతి ఇంటికి వచ్చి, వారి కిరాణాషాపులో కాసేపు సేదతీరాడు. అనంతరం జలుమూరు మండలం కొండకామేశ్వరిపేటలో ఉన్న తన చెల్లెలు జ్యోతి దగ్గరకి వెళతానని చెప్పి వెళ్లిపోయాడు. కాగా శుక్రవారం ఉదయం గ్రానైట్‌ సిబ్బంది బహిర్భుమి కోసం పక్కన ఉన్నతోటలోకి వెళ్లగా అక్కడ ఓ చెట్టుకి ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించాడు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమా చారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కుటుంబసభ్యులకు సమా చారం అందజేశారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ అసుపత్రికి తరలిం చారు. మోహన్‌కు భార్య హేమలతతోపాటు కుమార్తె ఉంది. హేమలత ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు.

కూనజమ్మన్నపేటలో వివాహిత..

సరుబుజ్జిలి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): కూనజమ్మన్నపేట గ్రామానికి చెందిన కూన నీలురాణి (21) శుక్రవారం ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్‌ఐ బి.హైమావతి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మృతురాలు రాణి గత కొంతకాలం నుంచి గైనిక్‌ సంబంధిత అనారోగ్యంతో బాధ పడుతుందన్నారు. అనారోగ్యం వల్ల మానసిక క్షోభకు గురై ఎవరూ లేని సమయంలో ఉరి పోసుకున్నట్టు తెలిపారు. చికిత్స కోసం సరుబుజ్జిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు మృతురాలి అమ్మమ్మ ఉప్పాడ వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలికి భర్త రవికుమార్‌తో పాటు రెండేళ్ల కుమార్తె ఉంది.

Updated Date - Nov 01 , 2025 | 12:20 AM