వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - Jun 05 , 2025 | 12:02 AM
శ్రీకాకుళం నగరంలోని రెడ్డిక వీధిలోని ఓ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసు కొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది.
శ్రీకాకుళం క్రైం, జూన్ 4 (ఆంధ్ర జ్యోతి): శ్రీకాకుళం నగరంలోని రెడ్డిక వీధిలోని ఓ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసు కొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం చోటు చేసు కుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రెడ్డికవీధిలో నివసిస్తున్న బత్తిని త్రినాఽథరావు (38) కార్పెంటర్ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసై తన భార్య లక్ష్మితో తగాదాలు పడుతుండేవాడు. ఈ నేపధ్యంలో మంగళవారం రాత్రి కూడా పూటుగా మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడి వేరొక గదిలోకి రాత్రి 11 గంటల సమయంలో వెళ్లిపోయి గడియ పెట్టుకున్నాడు. ఎప్పటిలాగే నిద్ర పోయాడనుకున్న భార్య ఉదయం లేచిన తర్వాత ఎంత పిలిచినా పలకకపోవడంతో స్థానికుల సాయంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా.. త్రినాథరావు ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే టూటౌన్ పోలీసులకు కుటుంబ సభ్యులు సమాచారం అందిం చారు. ఎస్‌ఐ రామారావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇప్పిలి వీధి సచివాలయ వీఆర్వో తోట రాహిత్యాదేవి సమక్షంలో శవ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు.
కళా ప్రదర్శనకు వచ్చి..
విశాఖ జిల్లా పెద గంట్యాడకు చెందిన వ్యక్తి మృతి
కంచిలి, జూన్ 4(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రానికి సమీపంలోని మఠం చెరువు వద్ద స్నానానికి వెళి గుండెపోటుకు గురై విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలానికి చెందిన కళాకారుడు సప్ప కల్యాణ్(65) బుధవారం ఉదయం మృతి చెందాడు. ఈ మేరకు స్థానికులు, తోటి కళాకారులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలో జరుగుతున్న కంచమ్మతల్లి సంబరాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కల్యాణ్ వచ్చాడు. మంగళవారం రాత్రి వజ్రపుకొత్తూరు మండలం కొమరల్తాడలో జరిగిన సంబరాల్లో బాలకృష్ణ డూప్‌గా నటించిన కల్యాణ్.. కంచిలి సంబరాల్లో పాల్గొనేందుకు బుధవారం వేకువ జామున మండల కేంద్రానికి వచ్చాడు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు మఠం చెరువు వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రదర్శన ఇచ్చేందుకు వచ్చిన కల్యాణ్ గుండెపోటుతో మృతి చెందడడంతో తోటి కళాకారులు కన్నీటి పర్యంతమయ్యారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..
ఇచ్ఛాపురం, జూన్ 4(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతం సవరదేవిపేట (పేటూరు) వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమా దంలో లొద్దపుట్టి గ్రామానికి చెందిన దుర్గాశి మహేష్(45) మృతి చెం దాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రేషన్ డీలర్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న లొద్దపుట్టి గ్రామం పెద్దవీధికి చెందిన మహేష్ మంగళవారం రాత్రి వరకు రేషన్ పంపిణీ చేశాడు. పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో తన గ్రామ సమీపంలో ఉన్న సవరదేవిపేట నుంచి నడిచి వస్తుం డగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో మహేష్ రోడ్డుపై పడిపోవడంతో తలకి తీవ్రంగా గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మహేష్ భార్య కొన్నాళ్ల కిందటే అనారోగ్యంతో మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం అయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఒడిశా రాష్ట్రం జరడా పోలీసులు కేసు నమోదు చేశారు.