Share News

తప్పిన పెనుప్రమాదం

ABN , Publish Date - Sep 08 , 2025 | 11:20 PM

Palm tree falls on auto, power lines damaged నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. విద్యార్థులు ఈ రహదారి వెంబడి పాఠశాలకు వెళ్తుంటారు. ఓ వైపు మోస్తరుగా వర్షం కురుస్తోంది. అదే సమయంలో తాటిచెట్టు విరిగి.. విద్యుత్‌ వైర్లపై పడింది. క్రమేపీ తాటిచెట్టు, విద్యుత్‌వైర్లు కలిపి.. అక్కడే రోడ్డుపై నిలిపిన ఆటోపై పడ్డాయి.

తప్పిన పెనుప్రమాదం
ఆటోపై పడిన తాటిచెట్టు, విద్యుత్‌ వైర్లు

ఆటోపై పడిన తాటిచెట్టు, విద్యుత్‌వైర్లు

రణస్థలం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. విద్యార్థులు ఈ రహదారి వెంబడి పాఠశాలకు వెళ్తుంటారు. ఓ వైపు మోస్తరుగా వర్షం కురుస్తోంది. అదే సమయంలో తాటిచెట్టు విరిగి.. విద్యుత్‌ వైర్లపై పడింది. క్రమేపీ తాటిచెట్టు, విద్యుత్‌వైర్లు కలిపి.. అక్కడే రోడ్డుపై నిలిపిన ఆటోపై పడ్డాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఆటోలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రణస్థలంలోని రామతీర్థం రోడ్డు జడ్పీ హైస్కూల్‌ సమీపాన సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మార్గంలో నిత్యం హైస్కూల్‌ విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే ఆటోలు, బస్సులు తరచుగా తిరుగుతుంటాయి. తాటిచెట్టు విరిగి.. విద్యుత్‌వైర్లతో సహా ఆటోపై పడిపోవడంతో స్థానికులు ఆందోళన చెందారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఘటనా స్థలానికి పోలీస్‌, విద్యుత్‌, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని తాటిచెట్టును తొలగించారు. రాత్రి 7గంటల వరకూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

Updated Date - Sep 08 , 2025 | 11:20 PM