Share News

తప్పిన ప్రమాదం

ABN , Publish Date - Dec 23 , 2025 | 12:44 AM

పెద్దబాణాపు రం సమీపాన జా తీయ రహదారిపై సోమవారం ఉద యం పెద్ద ప్రమాదం తప్పింది.

తప్పిన ప్రమాదం
లారీ కింద ఇరుకున్న కారు ముందు భాగం

నందిగాం, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): పెద్దబాణాపు రం సమీపాన జా తీయ రహదారిపై సోమవారం ఉద యం పెద్ద ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి పలాస వైపు వెళ్తున్న ఓ కారు.. ముందు వెళ్తున్న ట్రాలర్‌ (తోక లారీ)ను ఓవర్‌ ట్రాక్‌ చేస్తుండగా వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆ కారు డివైడ ర్‌పై నుంచి అవతల వైపునకు వెళ్లి ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొంది. ఈ ఘటనలో కారు ముందు భాగంగ దెబ్బతినగా.. అందులో ప్రయాణిస్తున్న నలు గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డివైడర్‌పై ఉన్న స్తంభాన్ని తొలుత కారు ఢీకొని వేగం తగ్గడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న ఆటో

పోలాకి, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): కొత్తపేట కూడలి వద్ద సోమవారం ఉదయం ఓ ఆటో ఎదురుగా ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి బలమైన గాయాలయ్యాయి. గాయ పడిన యుగంధర్‌, చిన్నమ్మడులను 108 వాహనంలో చికిత్స కోసం నరసన్నపేట సీహెచ్‌సీకి తరలించారు. ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని క్షతగాత్రుల కుటుంబసభ్యులు తెలిపారు.

Updated Date - Dec 23 , 2025 | 12:44 AM