పాడిపరిశ్రమ అభివృద్ధికి పెద్దపీట
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:21 PM
కూటమి ప్రభుత్వం పాడిపరిశ్రమ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి తెలిపారు. సోమవారం మబగాం పశువైద్యకేంద్రంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వైద్యాధికారి బి.పద్మప్రియ, అప్పలసూరి, ఓంకార్, మల్లేశ్వరరావు పాల్గొన్నారు.
పోలాకి, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం పాడిపరిశ్రమ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి తెలిపారు. సోమవారం మబగాం పశువైద్యకేంద్రంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వైద్యాధికారి బి.పద్మప్రియ, అప్పలసూరి, ఓంకార్, మల్లేశ్వరరావు పాల్గొన్నారు.
గాలి కుంటువ్యాధి టీకాలను వినియోగించుకోండి
పాతపట్నం, సెప్టెంబరు15(ఆంధ్రజ్యోతి):గాలి కుంటువ్యాధి నివారణా టీకాలు పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరా రు.సోమవారం పాతపట్నంలోని క్యాంపుకార్యాలయంలో జాతీయగాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమ ప్రచార గోడపత్రికలను ఆవిష్కరించారు. కార్యక్రమం లో ఏడీ ఎం.కరుణాకర్, టీడీపీనాయకులు తూలుగు తిరుపతిరావు, ఎ.మధు, పశు వైద్యాధికారులు బి.శ్రీవాణి, డీపీ అనిల్, కె.మౌనిక సంచార పశువైద్యశాల వైద్యులు కిరణ్ పాల్గొన్నారు.
231 పశువులకు టీకాలు
కోటబొమ్మాళి, సెప్టెంబరు 15(ఆంఽధ్రజ్యోతి): మండలంలో 12,100 గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు అందుబాటులో ఉన్నాయని పశువైద్యాధికారి లఖినేని కిరణ్‌కుమార్ తెలిపారు. సోమవారం నిమ్మాడ, నారాయణవలస, సింహ్రాదిపురం తదితర గ్రామాల్లో తిలారు పశువైద్యాధికారి మెండ ప్రజ్ఞచైతన్య ఆధ్వర్యంలో 231 పశువులకుటీకాలు వేశారు.కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ సిబ్బంది కె.అనంతరా వు, రాంబాబు, శంకర్, బాస్కరరావు, ఫణి, ప్రసాద్, రామకృష్ణ, శ్రీకర్ పాల్గొన్నారు.