Share News

జీఎస్టీ 2.0తో దేశంలో పెనుమార్పు

ABN , Publish Date - Oct 04 , 2025 | 11:51 PM

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జీఎస్టీ 2.0ను ప్రకటించారని, ఇది దేశంలో ఒక పెనుమార్పునకు శ్రీకారం చుట్టనుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.

జీఎస్టీ 2.0తో దేశంలో పెనుమార్పు
మాట్లాడుతున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

అరసవల్లి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జీఎస్టీ 2.0ను ప్రకటించారని, ఇది దేశంలో ఒక పెనుమార్పునకు శ్రీకారం చుట్టనుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నా రు. శనివారం నగరంలో ఎమ్మెల్యే గొండు శంకర్‌, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో కలిసి ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సంద ర్భంగా స్వయంగా ట్రాక్టర్‌ను నడిపారు. ర్యాలీ ఆర్ట్స్‌ కళాశాల వరకు సాగింది. కళాశాల మైదానం లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ.. దసరా, దీపావళి పండుగలతో పాటు దేశ ప్రజలకు ప్రధాని మోదీ జీఎస్టీ పండుగను తీసుకువచ్చారన్నారు. దేశం ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక, సైనిక శక్తిగా ఎదుగుతోందని, ఇటువంటి సమయంలో మనం పూర్తిగా స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలన్నారు. ఆత్మనిర్భర భారత్‌ లక్ష్యం నెరవేర్చడమే జీఎస్టీ 2.0 ధ్యేయమన్నారు. జీఎస్టీ 2.0 అనంతరం గత పది రోజుల్లో జిల్లాలో 2,237 వాహనాల కొనుగోళ్లు జరిగాయని ఇది ఒక రికార్డు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నెల రోజుల పాటు జీఎస్టీ ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయిం చారన్నారు. కార్యక్రమంలో ఎస్పీ కేవీ మహేశ్వ రరెడ్డి, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, ఆర్డీవో సాయి ప్రత్యూష, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2025 | 11:51 PM