Share News

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:22 AM

కారు అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న ఘటన నగరంలో చోటు చేసుకుంది.

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు

  • అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు

శ్రీకాకుళం క్రైం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కారు అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న ఘటన నగరంలో చోటు చేసుకుంది. స్థానికు లు తెలిపిన వివరా లిలా ఉన్నాయి.. పలాస మండలం గరుడఖండికి చెం దిన సాయికుమార్‌ మంగళవారం నవభారత్‌ జంక్షన్‌ మీదుగా కారుతో నగరం లోకి ప్రవేశించారు. లక్ష్మీథియేటర్‌ జంక్షన్‌ వద్దకు చేరుకోగానే కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని ఎదురు రోడ్డులోకి ప్రవేశించి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొంది. అయి తే కారులో ప్రయా ణిస్తున్న వారికి ఎటువంటి గాయాలవలేదు. విద్యుత్‌ స్తంభం నేలపై పడి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఈ ఘటనను చూసిన స్థాని కులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే ఎవరికీ ఏమీ కాకపోవడం తో ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు సమాచారం మేరకు ట్రాఫిక్‌ ఎస్‌ఐ సుధా కర్‌ ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి కారును పోలీస్‌ స్టేష న్‌కు తరలించి ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. వన్‌టౌన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

Updated Date - Sep 24 , 2025 | 12:22 AM