Share News

తీరానికి కొట్టుకొచ్చిన భారీ సొరచేప

ABN , Publish Date - Dec 30 , 2025 | 11:17 PM

): డి.మత్స్యలేశం పంచాయతీ కొత్తమత్స్యలేశం సముద్ర తీరానికి మంగళవారం భారీ సొరచేప కొట్టుకువచ్చింది.

 తీరానికి కొట్టుకొచ్చిన  భారీ సొరచేప
ఒడ్డుకు చేరిన భారీ సొరచేప

ఎచ్చెర్ల, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): డి.మత్స్యలేశం పంచాయతీ కొత్తమత్స్యలేశం సముద్ర తీరానికి మంగళవారం భారీ సొరచేప కొట్టుకువచ్చింది. కొన ఊపిరితో ఉన్న దీన్ని స్థానికులు గమనించి రక్షించే ప్రయత్నం చేశారు. సముద్రంలోకి తిరిగి పంపించే ప్రయత్నం చేయగా ఆ చేప అప్పటికే తీవ్రంగా గాయపడి ఉండడంతో ముందుకు కదల్లేని పరిస్థితుల్లో చనిపోయింది. ఈ చేప సుమారు 300 కిలోలకు పైగానే ఉంటుందని, తినేందుకు ఉపయోగడదని మత్స్యకారులు చెబుతున్నారు.

Updated Date - Dec 30 , 2025 | 11:17 PM