ఆరోగ్యవంతమైన సమాజంతోనే రాష్ట్రాభివృద్ధి
ABN , Publish Date - Oct 13 , 2025 | 11:50 PM
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంతోనే దేశంతో పాటు రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. సోమవారం చల్లవానిపేట గ్రామ సచివాలయంలో ఎనిమిదో రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు, అంతర్జాతీయ బాలిక దినోత్సవం వారోత్సవాలు పురస్కరించుకొని పోషణవిలువలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
జలుమూరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంతోనే దేశంతో పాటు రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. సోమవారం చల్లవానిపేట గ్రామ సచివాలయంలో ఎనిమిదో రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు, అంతర్జాతీయ బాలిక దినోత్సవం వారోత్సవాలు పురస్కరించుకొని పోషణవిలువలపై అవగాహన సదస్సు నిర్వహించారు. తొలుత గర్భిణులకు సీమంతం చేశారు. అనంతరం పౌష్టికాహారంపై ప్రతిజ్ఞ చేయించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి పోషణ వారోత్సవాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడడానికి ప్రతి ఒక్కరు సమతుల్యమైన ఆహారం తీసుకోవాలన్నారు కార్యక్రమంలో సారవకోట ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి సీహెచ్ వంశీప్రియ, ఇన్‌చార్జి ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, సర్పంచ్ పంచిరెడ్డి రామచంద్రరావు, టీడీపీ మండలాధ్యక్షుడు వెలమల రాజేంద్రనాయుడు, నాయకులు దుంగ స్వామిబాబు, తర్ర బలరాం, కింజరాపు సత్యనారాయణ పాల్గొన్నారు.
చల్లవానిపేటలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే రమణమూర్తి : జలుమూరు 1