Share News

ఘనంగా మినీ మహానాడు

ABN , Publish Date - May 22 , 2025 | 12:02 AM

ఆమదాలవలస పట్టణంలోని ఓ ప్రైవేట్‌ కల్యాణ మండపంలో బుధవారం మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా మినీ మహానాడు
వీర జవాన్‌ మురళీనాయక్‌కు నివాళులర్పిస్తున్న టీడీపీ శ్రేణులు

ఆమదాలవలస, మే 21(ఆంధ్రజ్యోతి): ఆమదాలవలస పట్టణంలోని ఓ ప్రైవేట్‌ కల్యాణ మండపంలో బుధవారం మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి మొదలవలస రమేష్‌ తొమ్మిది అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టగా వేదికపై ఉన్న ప్రజా ప్రతినిధులు, నా యకులు బలపరిచి ఆమోదించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురికి పలువురి కి పదవులతో గుర్తించడం జరిగింది. వారిని ఎమ్మెల్యే కూన రవికుమార్‌, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ఆధ్వ ర్యంలో ఘనంగా సన్మా నించారు. డీసీసీబీ చైర్మన్‌ శివ్వాల సూర్యనారా యణ, మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ ఆనెపు రామకృష్ణంనాయు డు, కళింగ కార్పొరేష న్‌ డైరెక్టర్‌ తమ్మినేని చంద్రశేఖర్‌, నారా యణపురం ఆనకట్టు చైర్మన్‌ సనపల ఢిల్లీశ్వరరావు, మాల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బోనెల అప్పారావు, ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర రచించిన రిటైర్డు ఉపాధ్యాయులు పీవీ నరసింహలను సన్మానించారు. పొందూరు మండలం ధర్మపురం గ్రామానికి చెందిన టీడీపీ వీరాభిమాని మరగుజ్జి దివ్యాంగుడు వేదికపైకి వచ్చి రవికుమార్‌ రామ్మోహన్‌నాయుడుల మధ్య సోఫాపై కూర్చొని అందరికీ తెలుగుదేశం సహనం చూపించారు. దీంతో ఎమ్మెల్యే కేంద్ర మంత్రి ఆ వ్యక్తిని అభినందించి పార్టీ కండువాలు వేసి అభినందనలు తెలిపారు.

వీరజవాన్‌కు నివాళి..

మినీ మహానాడు ప్రారంభానికి ముందు ఎమ్మెల్యే రవికుమార్‌ పాకిస్తాన్‌ భారత్‌ సింధూర్‌ ఆపరేషన్‌ ప్రాముఖ్యత వివరిస్తూ సైనికులకు అభినందనలు తెలిపారు. అదే విధంగా సింధూర ఆపరేషన్‌లో వీరమరణం పొందిన రాష్ట్రానికి చెందిన మురళీనాయక్‌కు నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

విజయవంతం చేయండి

అరసవల్లి, మే 21(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో గురువారం జరుగనున్న మినీ మహానాడుకు పార్టీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో గల పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించనున్న మినీ మహానాడు ఏర్పాట్లపై ఆయన పార్టీ నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఘనంగా నిర్వహించనున్న మినీ మహానాడులో కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తోపాటు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఏఎంసీ చైర్మన్లు హాజరుకానున్నట్టు తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. ఈ ఏడాది పాలనాలో చేసిన సంక్షేమం, అభివృద్ధి పనులపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తా మన్నారు. కార్యక్రమంలో పీఎంజే బాబు, మాదారపు వెంకటేష్‌, కలగ జగదీష్‌, మెండ దాసునాయుడు, సింతు సుధాకర్‌, పాండ్రంకి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2025 | 12:02 AM