Share News

విశాఖ సమ్మిట్‌లో పెట్టుబడుల వరద

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:42 PM

రాష్ట్ర ప్రభుత్వం విశాఖ పట్నంలో రెండు రోజులు నిర్వహించిన సీఐఐ సమ్మిట్‌ విజయవంతమై పెట్టుబడుల వరద కనిపిం చిందని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు.

విశాఖ సమ్మిట్‌లో పెట్టుబడుల వరద
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవికుమార్‌

ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌

ఆమదాలవలస, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం విశాఖ పట్నంలో రెండు రోజులు నిర్వహించిన సీఐఐ సమ్మిట్‌ విజయవంతమై పెట్టుబడుల వరద కనిపిం చిందని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. ఆదివారం ఆయ న విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్య మం త్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్‌ ఎంతో కష్టపడి ప్రపంచ దేశాల్లో పర్యటించి రా ష్ట్రాన్ని పరిశ్రమల హబ్‌గా మార్చేందుకు నిరంతరం శ్రమిస్తు న్నారన్నారు. రెండు రోజుల్లోనే భారీ ఒప్పందాలు కుదుర్చు కొని పెట్టుబడుల వర్షం కురిపించిన ఘనత వీరికే దక్కు తుందన్నారు. ఈ సమ్మిట్‌లో 613 ఒప్పందాల ద్వారా 16,13, 188 ఉద్యోగావకాశాలతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందు తుందన్నారు. పెట్టుబడులు ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా మూడు ప్రాంతా లకు సమాన ప్రాతిపదికన వెళ్లడం ప్ర భుత్వం వికేంద్రీ కరణ నిబద్ధతకు నిదర్శనమన్నారు. ము ఖ్యంగా రాయలసీమ అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేక కృషి చేస్తున్నార న్నారు. ఇప్పటికే మంత్రి లోకేశ్‌ రాయల సీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు గైడ్‌ చేయడం జరిగిందన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రా ష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రా మిక వేత్తలు ఎవరూ ముందుకు రాలేదన్నారు. 2014-2019 మధ్య టీడీపీ పాలనలో వచ్చిన కొన్ని పరిశ్రమలు ఆ తరు వాత రాష్ట్రం విడిచి పెట్టి వెళ్లిపో వడం దురదృష్టకరమన్నారు. ప్రస్తుతం పరిశ్రమలు మళ్లీ రాష్ట్రం వైపు వస్తుండడం సీఎం చంద్ర బాబు సమర్థతకు నిదర్శనమని, రాష్ట్రాభివృద్ధి మరలా ట్రాక్‌ పైకి వచ్చిందని ఆయన అన్నారు.

Updated Date - Nov 16 , 2025 | 11:42 PM