ఇళ్ల పండుగ
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:00 AM
లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను బుధవారం పంపిణీ చేశారు.
లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను బుధవారం పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లాలో ప్రారంభించగా జిల్లాలో అధికారులు, ఎమ్మెల్యేలు ఇళ్లను, మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందించారు.
పక్కా ఇల్లే లక్ష్యంగా చర్యలు: శంకర్
అరసవల్లి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ప్రతీ పేదవానికి పక్కా ఇల్లు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పనిచేస్తోందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. పీఎంఏవైలో భాగంగా రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు నగరంలోని మొండి వీధిలో బుధవారం అందజేశారు. జిల్లాలో ఇప్పటివరకు 2,900 ఇళ్లు పూర్తి చేయ డం జరిగిందని, ఇప్పుడు 2.0లో భాగంగా 286 ఇళ్లు మంజూ రు చేశామన్నారు. కార్యక్రమంలో డీఆర్వో వి.లక్ష్మణ మూర్తి, హౌసింగ్ పీడీ రమాకాంత్, మునిసిపల్ కార్పొరేషన్ కమిష నర్ ప్రసాదరావు, పరిశ్రమల శాఖ మేనేజర్ శ్రీధర్ తదిత రులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: అశోక్
కవిటి/ఇచ్ఛాపురం, నవంబరు 12(ఆంరఽధజ్యోతి): పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. ఇచ్ఛాపురం మునిసిపాల్టీ పరిధిలో పీఎంఏవై కింద 123 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను బుధవారం రామయ్యపుట్టుగలో అందించారు. లబ్ధి దారులు ప్రభుత్వ సహకారంతో సొంతంగా ఇళ్లు నిర్మించుకోవాల న్నా రు. కార్యక్రమంలో డ్వామా పీడీ సుధాకర్, మునిసిపల్ కమి షనర్ ఎన్.రమేష్, ఏఈ వీఎం ప్రసాద్, పార్టీ నాయకులు కొండా శంకర్‌రెడ్డి, జానకిరావు, సుభాష్ తదిత రులు పాల్గొన్నారు.
అర్హతే ప్రాతిపదికగా గృహాలు: ఎంజీఆర్
పాతపట్నం/రూరల్, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): అర్హతే ప్రాతిపదికగా కూటమి ప్రభుత్వం గృహాలు మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. బుధ వారం తిడ్డిమి గ్రామంలో ప్రభుత్వ నిధులతో పూర్తిచేసుకుని జరిగిన గృహ ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రభు త్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. గత వైసీపీ హయాంలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కార్య క్రమంలో జిల్లా కార్యనిర్వాహణాధికారి డి.సత్యనారా యణ, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, తహసీల్దార్ నందగామ ప్రసాద రావు, ఎంపీడీవో కృష్ణమూర్తి, హౌసింగ్ డీఈ ఎం.మోహన రావు, ఏఈ వై.సీతారామరాజు కూటమి నాయకులు పాల్గొన్నారు.
అర్హులందరికీ ఇళ్లు: బగ్గు
పోలాకి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి భరోసా ఇచ్చారు. బుధవారం తలసముద్రం గ్రామంలో నిర్మాణం పూర్తయిన ఇళ్లను ఆయన ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో ఇల్లులేదనే మాట రాకూడదన్నారు. మంజూరు చేసిన ఇంటిని త్వరగా లబ్ధిదారుడు నిర్మించుకోవాలన్నారు. గత ప్రభుత్వం ఇళ్లు రానీయకుండా కేంద్రం పంపిన నిధులు దుర్వినియోగం చేసిందన్నారు. తహసీల్దార్ పి.శ్రీనివాసరావు, ఎంపీడీవో రవికుమార్, హౌసింగ్ డీఈ, ఏఈ, కూటమి నాయకులు ఎంవీ నాయుడు, కిల్లి వేణు, ప్రగడ సూరిబాబు పాల్గొన్నారు.
లోలుగులో ఇళ్ల పంపిణీ
పొందూరు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): పేదవాడికి సొం తింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని డీఆర్‌డీఏ పీడీ పి.కిరణ్‌కుమార్ అన్నారు. లోలుగు గ్రామంలో బుధ వారం నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజే శారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, ఎమ్మెల్యే రవికుమార్ సతీమణి కూన ప్రమీల, గృహ నిర్మాణశాఖ ఏడీ డి.సన్యాసి రావు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కూన వెంకట సత్యనారా యణ, మండల ప్రత్యేకాధికారి రఘునాథ్, ఎంపీడీవో వాసు దేవరావు, తహసీల్దార్ వెంకటేష్, కూటమి నాయకులు సీపాన శ్రీరంగనాయకులు, బలగ శంకరభాస్కరరావు, గాడు నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.