డ్రగ్స్ రహిత రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:18 AM
డ్రగ్స్ రహిత రాష్ట్రసాధనే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.
పాతపట్నం/రూరల్, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ రహిత రాష్ట్రసాధనే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత రాష్ట్ర సాధన దిశగా పాయకరావుపేట నుంచి ఇచ్ఛాపురం వరకు చేపట్టిన అభ్యుదయ సైకిల్ ర్యాలీను కొరసవాడ గ్రామం వద్ద శనివారం సాయంత్రం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్వాగతించారు. 25 మంది టీం సభ్యులను ఘనంగా స్వాగతించి ర్యాలీలో పాల్గొన్నారు. పాతపట్నం వరకూ సైకిల్‌పై ర్యాలీ సందడి చేశారు. అనంతరం పాతపట్నం కేఎస్‌ఎం ప్లాజాలో బస ఏర్పాటు చేశారు. సోమవారం పునఃప్రారంభ మవుతుందని ఎస్‌ఐ కె.మధుసూదనరావు తెలిపారు. ఇదిలావుంటే కొరసవాడ దాటి పాతపట్నం వస్తుండగా బూరగాం రైస్‌మిల్లు వద్దకు చేరేసమయంలో ర్యాలీ సభ్యుడు ఏఆర్ కానిస్టేబుల్ సవర భాస్కరరావు తోటి సభ్యుడిని గుద్దుకుని స్వల్పంగా గాయపడ్డాడరు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం స్థానిక సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. స్వల్ప గాయమే కావడంతో యథావిధిలో ర్యాలీలో పాల్గొంటారని పోలీసులు తెలిపారు.