డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:52 PM
డ్రగ్స్ రహిత రాష్ట్రమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి, సీనియర్ టీడీపీ నాయకులు గౌతు శివాజీ పిలుపునిచ్చారు.
హరిపురం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ రహిత రాష్ట్రమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి, సీనియర్ టీడీపీ నాయకులు గౌతు శివాజీ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు వ్యతిరే కంగా పాయకరావుపేట నుంచి ఇచ్ఛాపురం వరకు పోలీసు శాఖ చేపట్టిన అభ్యుదయ సైకిల్ యాత్ర సోమవారం మందస మండలం హరిపురం చేరు కుంది. దీంతో మాజీ మంత్రి గౌతు శివాజీ, డీఎస్పీ షేక్ షెహబాజ్ అహ్మద్ పాల్గొని యాత్రను ప్రా రంభించారు. పలు పాఠశాలలు, కళశాలలలు వి ద్యార్థులు పాల్గొని హరిపురం- బాలిగాం కూడలిలో మానవహారం ఏర్పాటు చేశారు. కొర్రాయిగేటు నుంచి హరిపురం రట్టి రోడ్డు వరకు సుమారు మూడు కిలోమీటర్లు మేరకు వేలాదిమంది విద్యా ర్థులతో ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా నిర్వ హించిన సమావేశంలో శివాజీ మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్‌కు కేంద్రంగా మా ర్చిందని తీవ్రంగా విమర్శించారు. దీన్ని సీఎం చంద్రబాబు చక్కదిద్ది మన బిడ్డలకు బంగారు భవిష్యత్తు అందజేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీఐ తిరుపతిరావు, ఎస్‌ఐ కృష్ణప్రసాద్, టీడీపీ నాయకులు బావన దుర్యోధన, బైరిశెట్టి గున్నయ్య, కొర్ల కన్నారావు, పి.వాసు, నవీన్, బి.కర్రయ్య, ఎంపీడీవో వెంకటరమణ, ఎంఈవో ఎం.లక్ష్మణరావు, జి.రంజిత్ తదితరులు పాల్గొన్నారు.