Share News

పాతపట్నం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే

ABN , Publish Date - Aug 13 , 2025 | 12:13 AM

పాతపట్నం కేంద్రంగా కొత్తజిల్లాను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మా మిడి గోవిం దరావు డి మాండ్‌ చేశారు. స్థానిక వ్యవ సాయ మా ర్కెట్‌ యార్డ్‌ ప్రాం గణంలో మం డల ముఖ్య నేతలతో మం గళవారం స మావేశాన్ని ని ర్వహించారు.

 పాతపట్నం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు :

పాతపట్నం, ఆగస్టు 12 (ఆంఽధ్రజ్యోతి): పాతపట్నం కేంద్రంగా కొత్తజిల్లాను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మా మిడి గోవిం దరావు డి మాండ్‌ చేశారు. స్థానిక వ్యవ సాయ మా ర్కెట్‌ యార్డ్‌ ప్రాం గణంలో మం డల ముఖ్య నేతలతో మం గళవారం స మావేశాన్ని ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతపట్నం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుతో ఈ ప్రాంతానికి పునర్‌ వైభవం వస్తుందన్నారు. పాతపట్నం పార్లమెంటరీ కేంద్రంగానే వీవీగిరి లాంటి గొప్ప నాయకులు పార్లమెంట్‌లో అడుగుపెట్టారని గుర్తు చేశారు. కాలక్రమంలో గతంలో పాలకుల వైఫల్యంతో రెవెన్యూ డివిజినల్‌ కేంద్రం పలాసకు, 100పడకల ఆసుపత్రి పాలకొండకు తరలిపోయిందన్నారు. గతంలో టీడీపీ పాలనలో ఏడు మండలాలతో పాతపట్నం రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో ప్రతిపాదనలు పూర్తయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నికల కారణంగా అది కార్యరూపం దాల్చలేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇది బుట్ట దాఖలైందన్నారు. ఒడిశా సరిహద్దులో ఉన్న పాతపట్నంలో జిల్లా కేంద్రం ఏర్పాటుతో ఇరురాష్ట్రాల సరిహద్దు భూసమస్యలు, జల వివాదాలకు సత్వర పరిష్కారం దొరుకుతుందన్నారు. ప్రధానంగా నేరనియంత్రణలో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పలాస జిల్లాలో కలపడంతో పాతపట్నంకు ఒరిగేదేమీ ఉండదని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో హిరమండలం, కొత్తూరు, ఎల్‌ఎన్‌పేట తదితర మండలాల నాయకులు పాల్గొన్నారు.

వినతి పత్రాలను పరిగణనలోకి తీసుకోవాలి

ఎల్‌.ఎన్‌.పేట, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఎల్‌.ఎన్‌.పేట మండలాన్ని శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్‌కు మార్చాలని మండల ప్రజలు ఇస్తున్న వినతి పత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని హిరమండలం ఏఎంసీ డైరెక్టర్‌ పి.నాగేశ్వరరావు, మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు రామారావులు అన్నారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దార్‌ జె.ఈశ్వరమ్మకు వినతిపత్రాన్ని ఇచ్చారు. వీరితో పాటు రాంబాబు, రాజేష్‌, బాలకృష్న, రామశంకరరావులు పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 12:13 AM