Share News

జిల్లా అభివృద్ధికి పక్కా ప్రణాళిక

ABN , Publish Date - Dec 31 , 2025 | 11:45 PM

నూతన సంవ త్సరంలో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధమైనట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుం డ్కర్‌ తెలిపారు.

జిల్లా అభివృద్ధికి పక్కా ప్రణాళిక

- కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం, డిసెంబరు31 (ఆంధ్రజ్యోతి): నూతన సంవ త్సరంలో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధమైనట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుం డ్కర్‌ తెలిపారు. నూతన సంవ త్సర లక్ష్యాలను ‘ఆంధ్రజ్యో తి’తో ప్రత్యేకంగా పంచుకు న్నారు. ప్రధానంగా ఉపాధి కల్పన, ఆర్థికాభి వృద్ధి, మహిళా రక్షణపై ప్రత్యేక దృష్టి సారిం చనున్నట్లు ఆయన తెలిపారు. కలెక్టర్‌ నిర్దే శించుకున్న కీలక లక్ష్యాలు ఇవే.

- జిల్లాలో నూతన పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవ కాశాలు కల్పించడం.

- జిల్లా స్థూల విలువ జోడింపు (జీవీఏ), తలసరి ఆదాయాన్ని గణనీయంగా పెంచడం.

- సముద్రపు నాచు, కోరమీను సాగు, కృత్రిమ దిబ్బల(ఆర్టిఫిషియల్‌ రీఫ్స్‌) ఏర్పాటు ద్వారా మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడం.

- డ్రగ్స్‌ రహిత జిల్లాగా మార్చడం, మహిళలపై నేరాలను పూర్తిగా తగ్గించి వారి సాధికారితకు కృషిచేయడం.

- సంప్రదాయ పంటలే కాకుండా పంటల వైవిద్యకరణ(క్రాప్‌ డైవర్సిఫికేషన్‌) ద్వారా ఉత్పాదకతను పెంచడం.

- బారువ బీచ్‌ను అంతర్జాతీయ స్థాయి ‘బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌’ గా తీర్చిదిద్దడం.

Updated Date - Dec 31 , 2025 | 11:45 PM