Share News

రైతులకు మేలు చేసేది కూటమి ప్రభుత్వం

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:07 AM

రాష్ట్రంలో రైతులకు మేలుచేసేది కూట మి ప్రభుత్వమని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ అన్నారు. పీఏసీఎస్‌ కార్యాలయం వద్ద సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

రైతులకు మేలు చేసేది కూటమి ప్రభుత్వం
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అశోక్‌

ఎమ్మెల్యే అశోక్‌

కవిటి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతులకు మేలుచేసేది కూట మి ప్రభుత్వమని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ అన్నారు. పీఏసీఎస్‌ కార్యాలయం వద్ద సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం ఒకరోజులోనే సొమ్ము చెల్లిస్తోం దన్నారు. రవాణా చార్జీలు, గోనె సంచుల చార్జీలను కూడా ఇస్తోందన్నారు. నేరుగా రైతుసేవా కేంద్రాల ద్వారా ధాన్యం అమ్మకాలు చేయాలని, దళారు లను నమ్మ వద్దని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ బాసుదేవ్‌ ప్రదాన్‌, ఏఎంసీ చైర్మన్‌ మణిచంద్ర ప్రకాష్‌, కాళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బి.చిన్నబాబు, వ్యవసాయాధికారి పి.శ్రీదేవి, టీడీపీ మండల అధ్యక్షుడు పి.కృష్ణా రావు, నేతలు బి.రమేష్‌, బీమారావు రౌళో, బి.తిరుమలరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2025 | 12:07 AM