Share News

జిల్లా అభివృద్ధికి స్పష్టమైన ప్రణాళిక

ABN , Publish Date - Jun 10 , 2025 | 12:12 AM

జిల్లా అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిం చామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజ రాపు రామ్మోహన్‌ నాయుడు స్పష్టం చేశారు.

జిల్లా అభివృద్ధికి స్పష్టమైన ప్రణాళిక
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీనివాస్‌, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తదితరులు

  • కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు

శ్రీకాకుళం కలెక్టరేట్‌, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): జిల్లా అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిం చామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజ రాపు రామ్మోహన్‌ నాయుడు స్పష్టం చేశారు. సోమవా రం విజయవాడ సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన కలెక్టరేట్‌ నుంచి జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో కలిసి పాల్గొని మాట్లాడారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో జిల్లా కీలకపాత్ర పోషించనుందన్నారు. జిల్లాలో గల సముద్ర తీరం, రవాణా వనరులు, వ్యవసాయ శక్తిని పూర్తిగా వినియోగించుకుంటూ, జిల్లా తలసరి ఆదాయాన్ని పెంచేలా చర్యలు చేపడతామ న్నారు. ముఖ్యమంత్రి సునిసిత దృష్టితో రాష్ట్రం లో పీ-4 విధానాన్ని తీసుకువచ్చారన్నారు. ముఖ్యమంత్రి నుంచి ప్రేరణ పొంది, నేను కూడా 10 కుటుంబాలను దత్తత తీసుకుంటు న్నాను. మూలపేట పోర్టు, పలాస ఎయిర్‌ పోర్టు, ఇచ్ఛాపురం పరిధిలో జీడి, కొబ్బరి, పనస ఆధారిత పరిశ్రమల స్థాపన, రవాణా మార్గాల అభివృద్ధి వంటి చర్యలు జరుగనున్నాయి. వలస వెళ్లిన జిల్లా వాసులు తమ ఊరిని, జిల్లాను అభివృద్ధి చేయ డంలో భాగస్వాములవుతారని ఆశాభావం వ్యక్తం చేశా రు. సమావేశంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, ఆర్డీవో సాయిప్రత్యూష, సీపీవో లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2025 | 12:12 AM