Share News

ఇద్దరిపై కేసు నమోదు

ABN , Publish Date - Dec 31 , 2025 | 12:34 AM

శ్రీకాకుళం నగర పరిధి హయాతీనగరం బాలాజీనగర్‌ వద్ద ఆదివారం రాత్రి అంబేద్కర్‌ విగ్రహంపై దాడి చేసిన ఘటనలో మంగళవారం ఇద్దరిని అదపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు వన్‌టౌన్‌ ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు.

ఇద్దరిపై కేసు నమోదు

శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగర పరిధి హయాతీనగరం బాలాజీనగర్‌ వద్ద ఆదివారం రాత్రి అంబేద్కర్‌ విగ్రహంపై దాడి చేసిన ఘటనలో మంగళవారం ఇద్దరిని అదపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు వన్‌టౌన్‌ ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు. విగ్రహం పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. విగ్రహం చేయి విరగ్గొట్టినవాళ్లు మురళి, సాయిని గుర్తించామన్నారు.

మోసగించిన కేసులో వ్యక్తి అరెస్టు

పాతపట్నం, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): మండల పరిధి శోభ పంచాయతీ లోని ఓ గ్రామానికి చెందిన మహిళను పెళ్లిచేసుకుంటానని నమ్మబలికి మోస గించిన కేసులో ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్టు మంగళవారం సీఐ ఎన్‌.సన్యాసినా యుడు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా రాణిపేట పరిధి పెద్దకింగ గ్రామానికి చెందిన నీలాపు శ్యామ్స్‌న్‌కు బాధితురాలికి మూడు నెలల కిందట పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటా నని నమ్మబలికాడు. అలాగే ఆమె నుంచి రూ.1,70,000 తీసుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయా ధికారి రిమాండ్‌ విధించినట్టు సీఐ తెలిపారు.

Updated Date - Dec 31 , 2025 | 12:34 AM