క్రీడలతో ఉజ్వల భవిష్యత్
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:31 PM
విద్యార్థి దశ నుంచే క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ సాధ్యమని ఎమ్మె ల్యే రవికుమార్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో 69వ అంతర పాఠశాల గ్రిగ్స్ క్రీడా పోటీలను సోమవారం ప్రారంభించారు.
ఆమదాలవలస, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): విద్యార్థి దశ నుంచే క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ సాధ్యమని ఎమ్మె ల్యే రవికుమార్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో 69వ అంతర పాఠశాల గ్రిగ్స్ క్రీడా పోటీలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, ఆరోగ్యవంత మైన జీవనశైలి, సమగ్రమైన వ్యక్తిత్వ వికాశానికి క్రీడలు దోహదం చేస్తాయన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతు లైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ తమ్మినేని గీతావిద్యాసాగర్, టీడీపీ రాష్ట్ర నాయకులు మొదలవలస రమేష్, తమ్మినేని చంద్రశేఖర్, బోర గోవిందరావు, నాయకులు సనపల ఢిల్లీశ్వ రరావు, ఎస్.మురళీధర్, నాగళ్ల మురళీధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రజారంజక పాలన
ఎమ్మెల్యేలు శంకర్, రవికుమార్
ఆమదాలవలస, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజా రంజక పాలన సాగుతోందని ఎమ్మెల్యేలు కూన రవికుమార్, గొండు శంకర్ అన్నారు. సోమవారం మునిసిపాలిటీ పరిధి చింతాడ, మన్నయ్యపేట, నందిగిరిపేట, తిమ్మాపురం, కుద్దిరాం ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణానికి ఒకటో వార్డు తిమ్మాపురంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడి, అన్ని ప్రాంతాలు అధ్వాన స్థితికి చేరుకున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి ముందుకు సాగుతోం దన్నారు. మురుగు నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఈ సమస్య పరిష్కారానికి రూ.1.66 కోట్లతో మురుగునీటి శుద్ధి కేంద్రాలను నిర్మిస్తున్నామన్నారు. మురుగునీటిని శుద్ధి చేసి చెరువుల్లో నిల్వ చేసేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ తమ్మినేని గీతా విద్యా సాగర్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎస్.మురళీధర్, పట్టణ మహిళా అధ్యక్షురాలు బోయిన సునీత, మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్లు బోర గోవిందరావు, కూన వెంకట రాజ్యలక్ష్మి జనసేన కన్వీనర్ పేరాడ రామ్మో హన్, పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.