Share News

ఇంటర్‌లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్‌

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:02 AM

ఇంటర్‌లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని ప్రభుత్వ విప్‌, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ తెలిపారు. సోమ వారం ఇచ్ఛాపురంలోని బాలికల కళాశాలలో ప్రిన్సిపాల్‌ శంకరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విద్యా ర్థినులకు ఉచితంగా టెస్ట్‌, నోట్‌ బుక్స్‌ అందజేశారు.

ఇంటర్‌లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్‌
మాట్లాడుతున్న అశోక్‌:

ఇచ్ఛాపురం, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని ప్రభుత్వ విప్‌, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ తెలిపారు. సోమ వారం ఇచ్ఛాపురంలోని బాలికల కళాశాలలో ప్రిన్సిపాల్‌ శంకరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విద్యా ర్థినులకు ఉచితంగా టెస్ట్‌, నోట్‌ బుక్స్‌ అందజేశారు. ఇంటర్‌లో 979 మార్కులు సాధించిన బిందురెడ్డి, 454 మార్కులు సాధించిన వర్షితకు సత్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకొ చ్చిన జీవో-117లో అనేక అవక తవకలు చోటుచేసుకున్నాయని తెలి పారు. బఅనంతరం విద్యార్థులు పలు సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు.కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దాసరి రాజు, టీడీపీ పట్టణ కార్య దర్శి నందికిజాని, కౌన్సిలర్లు పత్రి తవిటయ్య, ఆశి లీలారాణి,జి.శేఖర్‌ పాల్గొన్నారు. కాగా ఇచ్ఛాపురానికి చెందిన నీలాపు భగవాన్‌ 68వ జాతీయస్థాయి స్కూల్‌ గేమ్స్‌లో తైక్వాండో అండర్‌-17 గ్రూప్‌లో 55కేజీల విభాగంలో బ్రాంచ్‌ మెడల్‌ సాధించడంతో విప్‌ బెందాళం అశోక్‌ అభినందించారు.

Updated Date - Apr 22 , 2025 | 12:02 AM