మెరుగైన ఫలితాలకు వంద రోజుల ప్రణాళిక
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:55 PM
ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధనకు వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నట్లు డీఈవో ఎ.రవిబాబు అన్నారు.
డీఈవో రవిబాబు
పొందూరు, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధనకు వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నట్లు డీఈవో ఎ.రవిబాబు అన్నారు. తోలాపి జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం ఉదయం 8.30 గంటలకు విద్యార్థులకు నిర్వహిం చిన ప్రత్యేక తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రణాళికలో భాగంగా అన్ని సబ్జెక్టులపై ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, వెనుకబడిన విద్యార్థు లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 100 రోజుల ప్రణాళిక అమలుచేయని పాఠశాలల్లో హెచ్‌ఎంతో పాటు సబ్జెక్టు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. గణితంపై విద్యార్థులకు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. కార్యక్రమంలో హెచ్‌ఎం ఉమా మహేశ్వరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం పిల్లల వలస జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు.
వంట కార్మికుల వేతన బకాయిలు చెల్లించాలి
అరసవల్లి, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): మధ్యాహ్న భోజన పథకంలో 6 నెలలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు, వంట కార్మి కుల వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు కె.నాగమణి, కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ఉత్తర కోరారు. ఈ మేరకు గురు వారం డీఈవో ఎ.రవిబాబును కలిసి వినతిపత్రం అందిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఇంటర్ కళాశాలల్లో 6 నెలలుగా, మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలల్లో 8 నెలలు గా బిల్లులు చెల్లించలేదన్నారు. అప్పులు చేసి వండి పెడుతుం డడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారికి ఇచ్చే రూ.3 వేల వేతనాన్ని సకాలంలో చెల్లించడం లేదన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా స్కూల్ విద్యా ర్థులకు రూ.20, కాలేజీ విద్యార్థులకు రూ.30 మెనూ చార్జీలు ఇవ్వాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సంఘం జిల్లా నాయకురాలు టి.ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.