9.2 కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - May 22 , 2025 | 12:03 AM
గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీ సులు అరెస్టు చేసి అతడి నుంచి 9.2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకు న్నారు.
ఇచ్ఛాపురం, మే 21(ఆంరఽధజ్యోతి): గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీ సులు అరెస్టు చేసి అతడి నుంచి 9.2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకు న్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం సర్కిల్ కార్యాల యంలో సీఐ మీసాల చిన్నంనాయుడు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా గేరేగేడి గ్రామానికి చెందిన గమేష్ నాయక్ ఒడిశా రాష్ట్రం కందమల్ జిల్లా తిలోరి గ్రామానికి చెందిన అజిత్ ప్రధాన్, సుభాష్ వీరి నుంచి 9.2 కిలోల గంజాయి కొనుగోలు చేశాడు. దీన్ని కర్ణాటక రాష్ట్రం మైసూర్ నగరానికి తీసుకువెళ్లి అక్కడ బబ్బూ కుమార్ అనే వ్యక్తికి అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో ఒడిశాలో కొను గోలు చేసిన బస్సులో ఇచ్ఛాపురం చేరుకున్నాడు. అక్కడి నుంచి రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. ఈ క్రమంలో పట్టణ ఎస్‌ఐ ముకుందరావుకు గంజా యి తరలిస్తున్నట్టు సమాచారం వచ్చింది. వెంటనే సిబ్బందితో రైల్వే స్టేషన్‌కు చేరుకుని అతడిని తనిఖీ చేయగా.. గంజాయితో పట్టుబడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. కార్యక్రమంలో పట్టణ ఎస్‌ఐ ముకుందరావు, సిబ్బంది పాల్గొన్నారు.