86 కేజీల గంజాయి సీజ్
ABN , Publish Date - Dec 31 , 2025 | 11:35 PM
ఒడిశా రాష్ట్రం బరం పురం నుంచి విజయనగరం తరలిస్తున్న గంజాయిని బుధ వారం సీజ్ చేసినట్లు సీఐ మీసాల చిన్నమనాయుడు తెలిపారు.
ఇచ్ఛాపురం, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): ఒడిశా రాష్ట్రం బరం పురం నుంచి విజయనగరం తరలిస్తున్న గంజాయిని బుధ వారం సీజ్ చేసినట్లు సీఐ మీసాల చిన్నమనాయుడు తెలిపారు. బరం పురం నగరం రామ్‌నగర్ లంజిపల్లికు చెందిన ఫ్రపుల్ కుమార్ జలి ఆప్టింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన కు పరిచయమైన గంజాయి వ్యాపారి గంజాం జిల్లా మహుదకి చెందిన హిమాంశు శేఖర్ మజి చెప్పినట్టుగా గంజాయిని మోహన గుమిగుడకి చెందిన ప్రశాంత్ నాయక్ వద్ద కొనుగోలు చేశాడు. విజయనగరంలో ఉన్న హిమాంశు శేఖర్‌కు అప్పగించేందుకు బుధ వారం కారులో 86కేజీల 950 గ్రాముల గంజాయిని తరలిస్తుండ గా ఎంతోటూరు రైల్వే ఎల్‌సీ గేటు వద్ద పట్టణ ఎస్‌ఐ ముకుంద రావు తనిఖీలు చేస్తూ గంజాయి పట్టుకుని స్వాధీనం చేసుకున్నా డని తెలిపారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
చికిత్స పొందుతూ యువకుడి మృతి
శ్రీకాకుళం రూరల్/జి.సిగడాం, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం సమీపంలోని ఓ నర్సింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్. శరత్‌చంద్ర (21) మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గుర్తించిన స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తరలిం చగా చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందాడు. జి.సిగడాం మండలం పెంట గ్రా మానికి చెందిన చంద్ర చదువులో వెనుకబడడంతో మనస్తా పానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తండ్రి విజయ్ శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ కె.రాము తెలిపారు.