Share News

జాతీయ లోక్‌ అదాలత్‌లో 6,508 కేసుల రాజీ

ABN , Publish Date - Dec 13 , 2025 | 11:32 PM

జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 6,508 కేసులు రాజీ అయినట్లు జిల్లా న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా తెలిపారు.

జాతీయ లోక్‌ అదాలత్‌లో 6,508 కేసుల రాజీ
శ్రీకాకుళం లీగల్‌: లోక్‌ అదాలత్‌లో పాల్గొన్న జిల్లా న్యాయాధికారి మౌలానా, అదనపు న్యాయాధికారులు

జాతీయ లోక్‌ అదాలత్‌లో 6,508 కేసుల రాజీ

జిల్లా న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

శ్రీకాకుళం లీగల్‌, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 6,508 కేసులు రాజీ అయినట్లు జిల్లా న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా తెలిపారు. జిల్లా కోర్టులో శనివారం జాతీ య అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. పరిష్కారం అయిన వాటిలో సివిల్‌ కేసులు 202, క్రిమినల్‌ కేసులు 6,253, ఫ్రీ లిటికేషన్‌ కేసులు 53 రాజీ అయ్యాయన్నారు. విడాకుల కేసులలో భార్యభర్తలు రాజీ అయి కేసు ముగించడంతో న్యాయాధికారులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదనపు న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

పలాసలో 620..

పలాస, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): స్థానిక మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో 620 కేసులు పరిష్కారమయ్యాయి. జూని యర్‌ సివిల్‌ న్యాయాధికారి యు.మాధురి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీపీ రమే ష, బార్‌అసోసియేషన్‌ అధ్యక్షుడు ఫయ్యజ్‌ అహ్మద్‌, ఉపాధ్య క్షుడు బీకేఆర్‌ పట్నాయక్‌, ఏజీపీ పిండి వెంకటరావు, కార్య దర్శి బెండి కాళిదాస్‌, సీఐ వై.రామకృష్ణ, ఎస్‌ఐ నర్సింహ మూర్తి, న్యాయవాదులు పాల్గొన్నారు.

నరసన్నపేటలో 316 కేసులు..

నరసన్నపేట, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): జాతీయ లోక్‌అదాలత్‌లో సత్వరమే కేసులను పరిష్కరించడం జరిగిందని జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి వాణి అన్నారు. శనివారం స్థానిక కోర్టులో లోక్‌అదాలత్‌ను నిర్వహించారు. 605 కేసులు రిఫర్‌ చేయగా 316 కేసులు పరిష్కరించారు. కార్యక్రమంలో ఏజీపీ వాన శ్రీనివాసరావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రావాడ కొండలరావు, రోణంకి కృష్ణంనాయుడు, రెడ్డి జగన్నాథం, జామి కామేశ్వరరావు, జీవీ రమణ, గొండు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

కోటబొమ్మాళిలో 192..

కోటబొమ్మాళి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): స్థానిక జూని యర్‌ సివిల్‌ కోర్టులో శనివారం జూనియర్‌ సివిల్‌ న్యాయా ధికారి ఎం.రోషిణి ఆధ్వర్యంలో జరిగిన జాతీయ లోక్‌ అదాల త్‌లో 192 కేసులు పరిష్కారం అయ్యాయి. కార్యక్ర మంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎల్‌.శ్రీనివాస్‌, న్యాయ వాదులు బి.ధర్మారావు, ఎస్‌.తిరుపతి, పోలీసులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

కొత్తూరులో 440..

కొత్తూరు, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): స్థానిక సివిల్‌ కోర్టులో శనివారం నిర్వహించిన నేషనల్‌ లోక్‌ అదాలత్‌లో సుమారు 440 వివిధ కేసులు పరిష్కారం అయినట్టు న్యా యాధికారి కందికట్ల రాణి తెలిపారు. అపరాధ రుసుముగా సుమారు రెండు లక్షలు వసూలు చేసిట్టు తెలిపారు. కార్యక్ర మంలో లోక్‌ అదాలత్‌ మెంబర్‌ వలురౌతు సుధాకరావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మహంతి అప్పారావు, ఎస్‌ఐ వెంకటేష్‌, న్యాయవాదులు పాల్గొన్నారు,

టెక్కలిలో 349 కేసులు..

టెక్కలి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): స్థానిక కోర్టు సముదాయంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో 349 కేసులు పరిష్కారమైనట్టు సీనియర్‌ సివిల్‌ న్యాయా ధికారి బి.నిర్మల, జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి యు. మాధురి తెలిపారు. బార్‌అసోసియేషన్‌ అధ్యక్షుడు పినకాన అజయ్‌కుమార్‌, ఏజీపీ దివ్వల వివేకానంద, ఏపీపీ సుధా రాణి, అదాలత్‌ సభ్యులు చంద్రశేఖర్‌ పట్నాయక్‌, కాంతా రావు, శ్రీనివాసరావులు పాల్గొన్నారు.

ఇచ్ఛాపురంలో 375..

ఇచ్ఛాపురం, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారానికి లోక్‌అదాలత్‌ సరైన వేదిక అని జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి పి.ఫరీష్‌కుమార్‌ అన్నారు. శనివారం కోర్టు ఆవరణలో జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహిం చారు. ఈ సందర్భంగా 375 కేసులు పరిష్కారమయ్యా యన్నారు. కార్యక్రమంలో ఏజీపీ నాగరాజుపాత్రో, న్యాయ వాదులు గిన్ని సీతయ్యరెడ్డి, ఎం.రాంబాబు, ప్రేమలత, సంతోష్‌కుమార్‌ సాహు, సీఐ మీసాల చిన్నమ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

పొందూరులో 415..

పొందూరు, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శనివారం కోర్టులో జాతీయ అదాలత్‌ నిర్వహించి 415 కేసులు పరిష్కరించినట్లు పొందూరు జూని యర్‌ సివిల్‌ న్యాయాధికారి బి.జ్యోత్స్న తెలిపారు. పొందూరు, జి.సిగడాం మండలాల పరిధిలో వివిధ కేసులను పరిష్కరిం చామన్నారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 13 , 2025 | 11:32 PM