450 లీటర్ల నాటుసారా స్వాధీనం
ABN , Publish Date - Dec 17 , 2025 | 11:53 PM
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు గ్రామాలలో ఇరురాష్ట్రాల ప్రొహిబిషన్ ఎండ్ ఎక్సైజ్ శాఖాధికారులు బుధవారం సంయుక్తంగా దాడులు చేశారు. ఈ దాడులలో 450 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్టు పాతపట్నం ఎక్సైజ్ సీఐ కోట కృష్ణారావు బుధవారం తెలిపారు.
పాతపట్నం/రూరల్, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర-ఒడిశా సరిహద్దు గ్రామాలలో ఇరురాష్ట్రాల ప్రొహిబిషన్ ఎండ్ ఎక్సైజ్ శాఖాధికారులు బుధవారం సంయుక్తంగా దాడులు చేశారు. ఈ దాడులలో 450 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్టు పాతపట్నం ఎక్సైజ్ సీఐ కోట కృష్ణారావు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతపట్నం, మెళియాపుట్టి పలాస మండలాల సరిహద్దులో గల ఒడిశా గ్రాఆలు కుయనరా, దుర్గం, భలేరి, సింగుపూర్ గ్రామాలలో దాడులు చేపట్టామని తెలిపారు. ఈ దాడులలో టెక్కలి, పలాస, కోటబొమ్మాళి పాతపట్నం, పొందూరు, ఒడిశాలోని గారబంద, పర్లాఖిమిడి, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. 450 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకోవడంతో పాటు సుమారు 8,650 లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసం చేసి..కేసు నమోదు చేసినట్టు సీఐ కృష్ణారావు వివరించారు.