Share News

45 అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ

ABN , Publish Date - Jun 01 , 2025 | 12:27 AM

బి.కంచరాం గ్రామంలో నిర్మించిన 45 అడుగుల సుబ్రహ్మణ్య సహిత అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు శనివారంతో ముగిశాయి.

45 అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ

పొందూరు, మే 31(ఆంధ్రజ్యోతి): బి.కంచరాం గ్రామంలో నిర్మించిన 45 అడుగుల సుబ్రహ్మణ్య సహిత అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు శనివారంతో ముగిశాయి. వారం రోజులుగా ఈ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తు న్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ముస్లిం కుటుంబం పాల్గొని మతసామరస్యం వెళ్లివిరిసేలా చేశారు. షేక్‌సాయిబు కుటుంబం భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శనివారం చివరి రోజు సీతారాముల కల్యాణం, విగ్రహ ప్రతిష్ఠ, స్వామివారి ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించారు. ఏపీ సాధు పరిషత్‌ స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హనుమాన్‌ ఉపాసకులు చిన్నదాన చిదంబరం స్వామి, రామానంద పరమహంస జ్ఞానయోగశాల స్వామి అంతార్ముఖానంద హనుమాన్‌ జీవిత కథను భక్తులకు వివరించారు. చివరిరోజుల స్వామిని వేలాదిమంది భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. వేలాది మంది అన్నసమారాధనలో పాల్గొన్నారు..

Updated Date - Jun 01 , 2025 | 12:28 AM