టీడీపీలో చేరిన 2,725 వైసీపీ కుటుంబాలు
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:44 AM
కూటమి పాలనకు ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.
పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన ఎమ్మెల్యే గోవిందరావు
పాతపట్నం, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): కూటమి పాలనకు ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర కనీసవేతన సలహాల మండలి జోన్-1 చైర్మన్ పి.శ్రీనివాసులరెడ్డి సమక్షంలో 2,725 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే నియోజక వర్గం అభివృద్ధికి సుమారు రూ.1160 కోట్ల నిధులు మంజూరు చేయించుకున్నట్టు తెలిపారు. గతంలో ఎన్నడూలేని విధంగా జరుగుతున్న అభివృద్ధి, సం క్షేమానికి ప్రజలు ఆకర్షితులవుతూ ప్రభుత్వపాల నకు బ్రహ్మరథం పడుతున్నట్టు తెలిపారు. పలు వురు వైసీపీని వీడి టీడీపీలో చేరడం ఇందుకు నిదర్శనమన్నారు. పాతపట్నం మండలం పాసిగం గుపేట నుంచి 300, బోరుభద్ర నుంచి 500, బూర గాం నుంచి 300 కుటుంబాలు చేరాయన్నారు. మెళియాపుట్టి పరిధిలోని శిరియాఖండి నుంచి 50, బాణాపురం నుంచి 50, వసుంధర నుంచి 75, రామంద్రాపురం నుంచి 100 కుటుంబాలు, హిర మండలం పరిధి కొమనాపల్లి నుంచి 300, లో కొండ నుంచి 300, రుగడ నుంచి 300, చవితిసీధి నుంచి 300, ఆర్టీసీ ఆర్‌ఆర్ కాలనీ నుంచి 150 కుటుంబాలు టీడీపీలో చేరినట్టు తెలిపారు. వీరిలో పలువురు సర్పంచ్‌లు ఉపసర్పంచ్‌లు, ఎంపీటీసీ లు, క్రియాశీలక నాయకులు వైసీపీ నుంచి టీడీపీలో చేరారన్నారు. తొలుతు ఎన్టీఆర్ విగ్రహా నికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఐదుమం డలాల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. భారీ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు రావడంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పండగ వాతావరణం నెలకొంది.